లావా ఐరిస్ 550క్యూ@రూ.13,000
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా 5.5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ‘ఐరిస్ 550క్యూ' మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ లావా కంపెనీ డివైస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంది. ధర రూ.13,000. ఫోన్ విక్రయాలు ఈ నెల నుంచే ప్రారంభకానున్నాయి. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.........

డ్యుయల్ సిమ్,
వోజీఎస్ టెక్నాలజీ పై స్పందించే 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్, బీఎస్ఐ సెన్సార్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11 బీజీఎస్, బ్లూటూత్ 4.0, జీపీఎస్),
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (2జీ నెట్‌వర్క్ పై 10 గంటల టాక్‌టైమ్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications