4400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో లావా ‘ఐరిస్ ఫ్యూయర్ 20’

Posted By:

ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ లావా ‘ఐరిస్ ఫ్యూయల్ 20' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.5,399. మెటాలిక్ గ్రే ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంచిన ఈ ఫోన్‌లు వచ్చే వారం నుంచి రిటైల్ అలానే ఈ-కామర్స్ మార్కెట్లలో లభ్యంకానున్నాయి.

4400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో లావా ‘ఐరిస్ ఫ్యూయర్ 20’

4400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఈ డివైస్ బ్యాటరీ సామర్థ్యం విషయంలో షియోమీ రెడ్మీ 1ఎస్ (2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ), మోటో ఇ (1980 ఎమ్ఏహెచ్ బ్యాటరీ), లెనోవో ఏ6000 (2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ), అసుస్ జెన్‌ఫోన్ 5 ఏ501సీజీ (2110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ)లతో పోటీ పడగలదు.

4400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో లావా ‘ఐరిస్ ఫ్యూయర్ 20’

లావా ఐరిస్ ఫ్యూయల్ 20 స్మార్ట్‌ఫోన్ కేవలం 2జీ కనెక్టువిటీని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇతన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల FWVGA డిస్ ప్లే, 1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

English summary
Lava Iris Fuel 20 With 4400mAh Battery Launched at Rs. 5,399. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot