లావా ఐరిస్ ఎక్స్1@రూ.7,999

|

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం ఇంకా క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థతో కూడిన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను లావా దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ‘లావా ఐరిస్ ఎక్స్ 1'గా మార్కెట్లో లభ్యంకానున్నఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ డివైస్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫ్లిప్ కవర్ ఫోన్‌ను ఆటో మెటిక్‌గా స్లీప్ మోడ్‌లోకి తీసుకువెళుతుంది. ప్రముఖ రిటైలర్ Amazon.in ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే27 నుంచి ప్రత్యేకంగా విక్రయించనుంది. ఫోన్ కొనుగోలు పై 16జీబి అల్ట్రా మైక్రోఎస్డీ కార్డ్‌ను కొనుగోలుదారులు ఉచితంగా పొందుతారు. మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్ ‘యూనిటీ 2'కు పోటీగా రూపుదిద్దుకున్న లావా ఐరిస్ ఎక్స్1 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

 
మరో కత్తిలాంటి స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!!

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ బీసీఎమ్23550 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
వీడియో కోర్ మల్టీమీడియా టెక్నాలజీ ఆధారంగా రూపకల్పన చేయబడిన ప్రత్యేకమైన గ్రాఫిక్ ఇంజిన్ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు,
8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ప్రత్యేకమైన బీఎస్ఐ+ సెన్సార్, ఆటోఫోకస్, టచ్ టూ ఫోకస్, హెచ్‌డిఆర్ మోడ్),
ఈ కెమెరా ద్వారా 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సాధ్యపడుతుంది,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు)
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్(క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ కాలింగ్ తో),
3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ, ఎడ్జ్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X