లావా ఐరిస్ ఎక్స్1... త్వరలో!

Posted By:

మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ఓ అత్యుత్తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా, ఐరిస్ ఎక్స్1 (Iris X1) పేరుతో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. లేటెస్ట్ వర్షన్ స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.8,000లోపు ఉండే అవకాశాలు ఉన్నాయి. లావా ఐరిస్ ఎక్స్1లో నిక్షిప్తం చేసిన కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే...

8,000 ధరలో అదిరిపోయే ఫోన్ రాబోతోంది!

ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల తాకేతెర,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

నోకియా, మోటరోలాకు పోటీనా..?

మార్కెట్ తాజా ట్రెండ్‌ను విశ్లేషించినట్లయితే ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ నోకియా ‘లూమియా 630' పేరుతో లేటెస్ట్ వర్షన్ విండోస్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్ ఫోన్ ధర రూ.11,500. తాజా మోటరోలా, ‘మోటో ఇ' పేరుతో మధ్య ముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.6,999. బుధవారం నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో లావా విడుదల చేయబోతున్న ‘ఐరిస్ ఎక్స్1' మార్కెట్లో ఏ విధమైన ప్రభావం చూపనుందో వేచి చూడాలి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot