దేశీయ మొబైల్ దిగ్గజం 'లావా మల్టీమీడియా' మొబైల్

Posted By: Super

దేశీయ మొబైల్ దిగ్గజం 'లావా మల్టీమీడియా' మొబైల్

దేశీయ మొబైల్ దిగ్గజం లావా కొత్తగా మార్కెట్లోకి 'లావా కెకెటి39' అనే డ్యూయల్ సిమ్ మల్టీమీడియా మొబైల్ ఫోన్‌ని విడుదల చేసింది. ఇండియాలోని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో ఈ మొబైల్ ఫోన్‌ని విడుదల చేయడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.4 ఇంచ్ QVGA టిఎఫ్‌టి డిస్ ప్లే స్క్రీన్‌తో రూపొందించారు. ఇందులో ఉన్న రికార్డింగ్ ఫీచర్‌తో మీయొక్క వాయిస్‌ని రికార్డ్ చేసుకొని, ఆటో కాల్ రికార్డ్ ఫీచర్ ద్వారా ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వినోచ్చు.

ఇందులో ఉన్న మరొ ముఖ్యమైన ఫీచర్ మొబైల్ ట్రాకర్. లావా కెకెటి39 మొబైల్‌ని పొగొట్టుకుంటే యూజర్స్ ఈ మొబైల్ ట్రాకర్ ద్వారా ఈజీగా ఎక్కడుందో పసిగెట్టేయోచ్చు. ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్న 0.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఇమేజిలను తీయవచ్చు. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 16జిబి వరకు విస్తరించుకొవచ్చు.

ప్రయాణాలలో ఎప్పుడైనా సరదాగా రేడియో పెట్టుకొవడానికి ఇందులో రేడియో నిక్షిప్తం చేయడం జరిగింది. వీటితో పాటు మల్టీ ఫార్మెట్ ఆడియో, వీడియో ప్లేయర్స్ ఇందులో ప్రత్యేకం. ఇక కమ్యూనికేషన్,కనెక్షన్ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం.

వీటితో పాటు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి వాటికి ఈజీగా కనెక్ట్ అవ్వోచ్చు. ఒకవేళ ఎప్పుడైనా మీకు బోర్ కొట్టినప్పుడు ఇందులో ఉన్న గేమ్స్‌తో కాస్త కాలక్షేపం చేయవచ్చు. లావా కెకెటి39 మొబైల్ ఫీచర్స్ ప్రత్యేకంగా...

లావా కెకెటి39 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

* 2 inch QVGA Display
* 240

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot