లావా నుంచి రెండు కొత్త ఫోన్‌లు

Posted By:

ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ లావా రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను తన అధికారిక వెబ్‌సైట్‌లో ఆవిష్కరించింది. లావా ఐరిస్ 349ఐ, లావా ఐరిస్ 404ఇ మోడల్స్‌లో ఈ ఫోన్‌లు లభ్యంకానున్నాయి. ఈ ఫోన్‌ల ధరలను లావా అధికారికంగా ప్రకటించనప్పటికి థర్డ్ పార్టీ ఆన్‌లైన్ రిటైలర్‌లు ఐరిస్ 349ఐ వేరియంట్‌ను రూ.2,899కి, ఐరిస్ 404ఇ వేరియంట్‌లను రూ.4,499కి ఆఫర్ చేస్తున్నాయి.

 లావా నుంచి రెండు కొత్త ఫోన్‌లు

లావా ఐరిస్ 349ఐ కీలక స్పెసిఫికేషన్‌లు:

3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్), సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎఫ్ఎమ్ రేడియో), 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 115x61.5x13.5మిల్లీ మీటర్లు.

లావా ఐరిస్ 404ఇ కీలక స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, వై-ఫై, బ్లూటూత్ 3.0, జీపీఆర్ఎస్, ఎడ్జ్ ఇంకా డ్యూయల్ సిమ్ స్లాట్), ఫోన్ పరిమాణం 125x64x9.9మిల్లీ మీటర్లు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Lava Launches Iris 349i, Iris 404e Dual-SIM Smartphones in India. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot