4000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ‘లావా ఐరిస్ ఫ్యూయల్ 60’
దేశవాళీ మొబైల్ ఫోన్‌ల బ్రాండ్ లావా, ‘ఐరిస్ ఫ్యూయల్ 60' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. శక్తివంతమైన 4000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ 32గంటల సుధీర్ఘ బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ధర రూ.8,888. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరింయట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 25 నుంచి అన్ని ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్‌ల వద్ద ఈ ఫోన్ లభ్యమవుతుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
లావా ఐరిస్ ఫ్యూయల్ 60 ప్రత్యేకతలు:
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో లాలీపాప్ అప్‌డేట్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 10 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ2 సెన్సార్ ప్రత్యేకతలతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యూయల్ సిమ్ స్లాట్, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 3.0, యూఎస్బీ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








