తక్కువ ధరకే Android Oreo 4జీ ఫోన్, రూ. 2 వేల నగదు వెనక్కి..

Written By:

దేశీయ దిగ్గజం లావా తన దేశీయ తొలి ఆండ్రాయిడ్‌ ఓరియో(గో ఎడిషన్‌) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తున్న 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌' ప్రొగ్రామ్‌లో భాగంగా జడ్‌50 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 10వేలకు పైగా రిటైల్‌ స్టోర్లలో, అదేవిధంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఆన్‌లైన్‌ ఛానళ్లలో అందుబాటులో ఉంచినట్టు లావా పేర్కొంది. ఈ లావా జడ్‌50 అసలు మార్కెట్‌ ఆపరేటింగ్‌ ధర 4,400 రూపాయలు. కాగా భారతీ ఎయిర్‌టెల్‌ మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌(నా తొలి స్మార్ట్‌ఫోన్‌) కార్యక్రమంలో భాగంగా ఈ ఫోన్ మీద రూ.2,000 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ అందిస్తోంది.

షియోమి ఫ్లాష్‌సేల్ వెనుక దిమ్మతిరిగే నిజాలు, అంతా ఓ మాయ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 4 వేల ధర..

రూ. 4 వేల ధర మీద ట్యాగ్ అయిన్ ఈ ఫోన్ పై Airtel రూ.2000 క్యాష్‌బ్యాక్‌ ప్రకటించడంతో ఇప్పుడు ఈ ఫోన్ రూ.2,400కే యూజర్లకు లభిస్తోంది. అయితే కస్టమర్లు రూ.2000 క్యాష్‌బ్యాక్‌ పొందాలంటే, తొలి 18 నెలలు రూ.3500తో, 19 నుంచి 36 నెలల మరో రూ.3500తో తమ ఎయిర్‌టెల్‌ అకౌంట్లలో రీఛార్జ్‌ చేసుకోవాలి.

1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్‌ స్పేస్..

ఈ జడ్‌50 స్మార్ట్‌ఫోన్‌లో 4.5 అంగుళాల డిస్‌ప్లే, 1.1 గిగాహెట్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్‌ స్పేస్, 5 మెగా పిక్సెల్‌ రియర్, ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఫ్లాష్‌ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. ఈ ఫోన్‌ను రెండేళ్ల వారెంటీతో మార్కెట్‌లోకి వచ్చింది. లావా అదనంగా వన్‌టైమ్‌ స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది. అయితే ఇది ఫోన్‌ కొనుగోలు చేసిన ఏడాది వరకే వాలిడ్‌లో ఉంటుంది.

లావా జడ్‌50 స్పెషిఫికేషన్లు..

ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో(గో ఎడిషన్‌)
4.5 అంగుళాల డిస్‌ప్లే
2.5డీ కర్వ్‌డ్‌ గొర్రిల్లా గ్లాస్‌
క్వాడ్‌-కోర్‌ 1.1గిగాహెడ్జ్‌ మీడియాటెక్‌ ఎంటీ6737ఎం ఎస్‌ఓసీ
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌
5 మెగాపిక్సెల్‌ రియర్‌, ఫ్రంట్‌ కెమెరా సెన్సార్స్‌
2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

గత ఏడాది డిసెంబర్‌లో..

గూగుల్‌ సంస్థ గత ఏడాది డిసెంబర్‌లో ఆండ్రాయిడ్‌ ఓరియో గో ఎడిషన్‌లో ఒక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఓఎస్‌పై పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లు తక్కువ డేటాను వినియోగించుకుంటూనే వేగంగా పనిచేస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lava Z50 Android Oreo (Go Edition) Smartphone Launched at Effective Price of Rs. 2,400: Specifications, Features More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot