లావా నుండి మరో డ్యూయల్ సిమ్ ఫోన్ 'ఎమ్ 70'

Posted By: Prashanth

లావా నుండి మరో డ్యూయల్ సిమ్ ఫోన్ 'ఎమ్ 70'

 

లావా మొబైల్స్ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి మరో టచ్ స్క్రీన్ ఫీచర్ కలిగిన మొబైల్ ఫోన్‌ని విడుదల చేయనుంది. ఆ మొబైల్ పేరు 'లావా ఎమ్70'. ఇటీవల కాలంలో లావా మొబైల్స్ కంపెనీ మార్కెట్లోకి పలు మొబైల్స్‌ని విడుదల చేసినప్పటికీ, డ్యూయల్ సిమ్ ఫీచర్స్‌పై ప్రత్యేకమైన శ్రధ్దను చూపెడుతున్న సంగతి తెలిసిందే. 3.2 ఇంచ్ డిస్ ప్లేతో యూజర్స్‌ని ఆకట్టుకునే అందం దీని సొంతం.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ఎల్‌ఈడి ఫ్లాష్ కెమెరా ప్రత్యేకం. డ్యూయల్ సిమ్ ఫీచర్ తో పాటు, అదిరిపోయేటటువంటి ఆడియోని అందిస్తుంది. ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ మార్కెట్లో ఉన్న అన్ని రకాల మీడియా ఫార్మెట్లను సపోర్టు చేస్తుంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 30MB మెమరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి మెమరీ స్లాట్ ద్వారా మెమరీని 8జిబి వరకు విస్తరించుకొవచ్చు.

'లావా ఎమ్70' మొబైల్ ప్రత్యేకతలు:

* 3.2-inch touchscreen , IPS display

* Accelerometer sensor

* 5 Mega-pixel with dual LED flash , Smile/Blink Detection, Live Effects

* Video Recording

* Video and Music Player

* FM Radio With Recording

* GPRS/EDGE

* Bluetooth

* Internal memory : 30 MB

* Expandable memory : up to 8GB

* Music features : Yamaha Codec, Dual Speakers with Metal Diaphragm

* Battery : Li-Ion 1200 mAh

'లావా ఎమ్70' మొబైల్ ధర ఇండియన్ మార్కెట్లో సుమారుగూ రూ 4,500 వరకు ఉండవచ్చునని అంచనా..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot