Home
Mobile

రూ.10 వేల ధరలో ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా లావా కొత్త స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా నుంచి భారత్ మార్కెట్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ గురించి అనేక వివరాలను సంస్థ వెల్లడిస్తోంది. లావా షార్క్‌ సిరీస్‌లో భాగంగా కొత్త ఫోన్‌ విడుదల కానుంది. ఈ ఫోన్‌ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా మెరుగైన బిల్ట్‌ క్వాలిటీతో అందుబాటులోకి వస్తుంది. లావా షార్క్‌ సిరీస్‌ ఫోన్‌ మే 23 వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ రూ.10 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి రానుందని లావా సంస్థ వెల్లడించింది.

లావా షార్క్‌ సిరీస్ నుంచి రానున్న (Lava Shark Series) ఫోన్‌ బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి వస్తున్నా.. మెరుగైన కెమెరా పనితీరును అందించే విధంగా కెమెరా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అన్ని లైటింగ్‌ కండిషన్‌లకు అనుగుణంగా నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్‌ చేయవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఇప్పటికే ఈ లావా షార్క్‌ సిరీస్‌ ఫోన్‌ సంబంధించిన అనేక వివరాలను సంస్థ టీజ్‌ చేసింది. ఈ ఫోన్‌ IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

lava new shark series smartphone

ఆప్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరా! :
ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా లావా షార్క్‌ సిరీస్‌ కొత్త హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత 13MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ప్రాసెసర్‌ వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ చిప్‌సెట్‌ LPDDR4x ర్యామ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 400,000 AnTuTu స్కోర్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

ఎప్పుడు లాంచ్‌ కానుంది.. ధర ఎంత ఉండనుంది..? :
లావా షార్క్ సిరీస్‌లో కొత్త హ్యాండ్‌సెట్ డిజైన్‌ సహా బ్యాటరీ, ఛార్జింగ్‌, చిప్‌సెట్‌ వంటి అనేక వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఫోన్‌ మే 23 వ తేదీన లాంచ్‌ కానుంది. అప్పటిలోగా అనేక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరియు రూ.10 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని సంస్థ వెల్లడించింది.

రూ.6499 ధరలో ఇటీవలే కొత్త ఫోన్‌ :
ఈ నెల తొలి వారంలో లావా ధర రూ.6499 కు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. లావా యువ స్టార్‌ 2 పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ లావా స్మార్ట్‌ఫోన్‌ 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

లావా యువ స్టార్‌ 2 ఫోన్‌ ఆక్టా కోర్‌ UNISOC చిప్‌సెట్‌తో లాంచ్‌ కానుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత (గో ఎడిషన్‌) పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 13MP ప్రైమరీ కెమెరాతోపాటు AI లెన్స్‌ను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను అమర్చారు. 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

లావా యువ స్టార్‌ 2 హ్యాండ్‌సెట్‌ 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌లాక్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4G నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుంది. మరియు FM రేడియో ను కూడా కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
lava new shark series smartphone will be launched under Rs10000 price range in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X