6.5 అంగుళాల డిస్‌ప్లే, 50MP డ్యూయల్ కెమెరాలతో లావా స్మార్ట్‌ఫోన్... అమెజాన్ ద్వారా సేల్..!
లావా O2 స్మార్ట్ ఫోన్ (Lava O2 Smartphone) త్వరలో భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. లావా సంస్థ ఈ విషయాన్ని X పోస్ట్ ద్వారా వెల్లడించింది. దీంతోపాటు ఈ ఫోన్ డిజైన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్ సెట్ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది.
విడుదల అనంతరం ఈ లావా O2 స్మార్ట్ ఫోన్ అమెజాన్ (Lava O2 Smartphone sale via Amazon) ద్వారా అందుబాటులోకి వస్తుంది. అయితే అమెజాన్ ల్యాండిగ్ పేజీ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ వివరాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. లావా సంస్థ విడుదల చేసిన టీజర్ ఆధారంగా ఈ హ్యాండ్ సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది.

వివిధ రకాలుగా కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది : అయితే చూసే యాంగిల్‌ను బట్టి కెమెరా మాడ్యూల్ వివిధ రకాలుగా కనిపిస్తుంది. ఇది ఆకట్టుకుంటుంది. దీంతోపాటు స్మార్ట్ ఫోన్ వెనుకవైపు లావా లోగోను కూడా గుర్తించవచ్చు. దీంతోపాటు ఈ వీడియో ఆధారంగా హ్యాండ్ సెట్ కింది భాగంలో USB -C ఛార్జింగ్ పోర్టు సహా స్పీకర్ గ్రిల్‌ను అమర్చారు.
6.5 అంగుళాల డిస్‌ప్లే, AG గ్లాస్.. : అమెజాన్ వెబ్‌పేజీ ద్వారా ఈ లావా O2 స్మార్ట్‌ఫోన్ మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందువైపు పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ మెజిస్టిక్ పర్పల్ రంగులోనూ అందుబాటులో ఉంటుంది. మరియు వెనుకవైపు AG గ్లాస్ తో వస్తుంది.
5000mAh బ్యాటరీ, Unisoc T616 చిప్‌సెట్ :
దీంతోపాటు ఈ లావా హ్యాండ్ సెట్ ఆక్టా కోర్ Unisoc T616 చిప్ సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 తో జతచేయబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ లావా స్మార్ట్ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
50MP AI డ్యూయల్ కెమెరాలు :
దీంతోపాటు ఈ లావా O2 హ్యాండ్ సెట్ 50MP AI డ్యూయల్ కెమెరాలు (Lava O2 Smartphone Specs) సహా సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ విడుదల తేదీపై స్పష్టత లేకున్నా.. త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








