ధర రూ.7999 కే 5000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
లావా కొత్త స్మార్ట్ ఫోన్ (Lava O2 Smartphone launched) భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో ఈ హ్యాండ్ సెట్‌ను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ ఆకర్షణీయమై డిజైన్ సహా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ప్రారంభ ఆఫర్ కింద ధర రూ.7999 కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
లావా O2 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు..
లావా O2 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్ రేట్‌తో వచ్చింది. డిజైన్ పరంగా AG గ్లాస్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా స్టైలిష్ లుక్ సొంతం చేసుకుంది. భద్రత కోసం ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సహా ఫేస్ లాక్‌ను కలిగి ఉంటుంది.

లావా O2 హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 తోపాటు 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని లావా తెలిపింది. UNISOC T616 ఆక్టాకోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ సహా 128GB UFS 2.0 స్టోరేజీతో జతచేయబడి ఉంది. ఈ ప్రాసెసర్ ద్వారా మెరుగ్గా పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.
కెమెరాల విభాగం విషయానికి వస్తే ఈ లావా కొత్త హ్యాండ్ సెట్ 50MP డ్యూయల్ AI కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

లావా O2 స్మార్ట్ ఫోన్‌ను ప్రారంభ ఆఫర్ కింద రూ.7999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మార్చి 27 నుంచి కొనుగోలుకు అందుబాటులో (Lava O2 Smartphone Sale) ఉంటుంది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్, లావా ఇ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ లావా కొత్త ఫోన్ మెజిస్టిక్ పర్పల్, ఇంపీరియల్ గ్రీన్, రాయల్ గోల్డ్ వంటి మూడు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
ఈ లావా కొత్త ఫోన్ సంవత్సరం పాటు వారంటీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ వారంటీ సమయంలో ఉచితంగా సర్వీస్ చేయనున్నారు. అది కూడా ఇంటి వద్దకే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ డోర్‌స్టెప్ సర్వీస్ కారణంగా వినియోగదారులు మెరుగైన అనుభూతిని పొందుతారని లావా సంస్థ భావిస్తోంది.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








