లావా నుంచి బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు లీక్..!
లావా సంస్థ నుంచి భారత్ మార్కెట్‌లో ఇటీవల లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. సేల్ కూడా ప్రారంభం అయింది. ఈ ఫోన్ 1.5k అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అయితే లావా సంస్థ నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది. డిసెంబర్ నెలలోనే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
లావా ప్లే మ్యాక్స్ 5G స్మార్ట్‌ఫోన్ (Lava Play Max 5G smartphone) గురించి సంస్థ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ తన X హ్యాండిల్ ద్వారా అనేక వివరాలను వెల్లడించారు. బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

చిప్‌సెట్ :
లావా ప్లే మ్యాక్స్ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలిపారు. ఇదే చిప్‌ను లావా ప్లే అల్ట్రా 5G ఫోన్‌లోనూ వినియోగించారు. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది.
50MP EIS :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP AI కెమెరా, మరో సెకండరీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.
లావా ప్లే మ్యాక్స్ 5G హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు వేపర్ ఛాంబర్‌ను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. బ్లాక్, వైట్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Exclusive: Lava Play Max 5G Specs and design!!
— Paras Guglani (@passionategeekz) November 28, 2025
- DM 7300
- 6.72" FHD+ 120hz
- UFS 3.1
- 50MP AI Camera with EIS
- 8GB/6GB
- Android 15
- Vapour chamber
- Under 12K
- December launch #Lava #LavaPlayMax pic.twitter.com/pM9uwZ71Kl
లావా ప్లే మ్యాక్స్ 5G స్మార్ట్‌ఫోన్ రూ.15 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే లావా సంస్థ ఎటువంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. అయితే త్వరలో ఈ వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ సంవత్సరం నవంబర్‌లో లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. అమెజాన్‌లో ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ఈ ఫోన్ 6.67 అంగుళాల 1.5K ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెట్ టచ్ ఫీచర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 66W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఫోన్ యాక్షన్ కీ, Vayu AI ఫీచర్‌ను కూడా ఉంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP OIS కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP EIS కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








