రూ.13999 ధరకే 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్ కలిగిన 5G ఫోన్..!
భారత్ లో ఎంట్రీ, బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. అందువల్ల అనేక సంస్థలు ఈ ధర సెగ్మెంట్ లో వివిధ మోడల్స్ ను లాంచ్ చేస్తోన్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ లావా ఇటీవల బడ్జెట్ ధరలో లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ను (Lava Play Ultra 5G Smartphone) విడుదల చేసింది. ఈ ఫోన్ 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ ని కలిగి ఉంది. డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
రూ.1000 డిస్కౌంట్ :
విడుదల సమయంలో లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16,499 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్ లో కూపన్ కోడ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

అంటే ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే తగ్గింపు ధరకు ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ను ధరలు రూ.13999, రూ.15499 గా ఉన్నాయి. ఈ లావా స్మార్ట్‌ఫోన్ ఆర్కిటిక్ స్కేట్, ఆర్కిటిక్ ప్రాస్ట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. లావా హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.

64MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 64MP సోనీ IMX682 కెమెరా, 5MP మ్యాక్రో కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు బ్యూటీ, పొర్ట్రెయిట్, నైట్ మోడ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో మోడ్, HDR వంటి ఫీచర్లను కలిగి ఉంది.
5000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.3, Wi-Fi 6, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్ లతో అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications