Home
Mobile

రూ.14999 ధరకే 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో 5G స్మార్ట్‌ఫోన్..!

Lava Play Ultra 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా నుంచి బుధవారం లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. బడ్జెట్ ధరలో అమోలెడ్ డిస్‌ప్లే, 64MP కెమెరా సహా అనేక ఆకట్టుకొనే స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉంది. IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ లావా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

Lava Play Ultra 5G Smartphone launched

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
లావా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

64MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలు నైట్‌మోడ్‌, HDR, బ్యూటీ, పొర్ట్రెయిట్‌, స్లో మోషన్‌, టైమ్‌ ల్యాప్స్‌, ప్రో మోడ్‌ సహా అనేక ఫీచర్లను సపోర్టు చేస్తాయి.

Lava Play Ultra 5G Smartphone launched

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ :
లావా ప్లే అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 45 గంటల వరకు టాక్‌ టైమ్‌ వస్తుందని లావా తెలిపింది. లేదా 510 గంటల వరకు స్టాండ్‌బై టైంను కలిగి ఉంటుందని చెబుతోంది.

కనెక్టివిటీ పరంగా ఈ లావా 5G బడ్జెట్‌ హ్యాండ్‌సెట్‌ 5G, 4G, వైఫై 6, బ్లూటూత్‌ 5.3, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ లావా స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16499 గా ఉంది. ఈ ఫోన్ సేల్‌ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. ఆర్కిటిక్‌ ప్రాస్ట్‌, ఆర్కిటిక్‌ స్కేట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. తొలి సేల్‌లో భాగంగా లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ను పొందవచ్చు. ICICI, SBI, HDFC బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా ను అందిస్తోంది. ఫలితంగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13999 గా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Play Ultra 5G Smartphone launched with 64MP Camera, 5000mAh Display in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X