బడ్జెట్ ధరలో 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ ఫోన్ కోసం చూస్తున్నారా.. రేపటి నుంచే సేల్..!
బడ్జెట్ ధరలో మంచి కెమెరాలతో ఇటీవల కాలంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఎందుకంటే భారత్‌లో బడ్జెట్, ఎంట్రీ లెవల్ హ్యాండ్‌సెట్‌లకు మంచి డిమాండ్ ఉంటోంది. ఇటీవల లావా సంస్థ రూ.15 వేల ధరలో లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ 64MP కెమెరా, HD+ డిస్‌ప్లే. IP64 రేటింగ్‌ను కలిగి ఉంది.
లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ రేపు (ఆగస్టు 25) మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ (Lava Play Ultra 5G Smartphone Sale) ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆర్కిటిక్ ప్రాస్ట్, ఆర్కిటిక్ స్కేట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

రూ.1000 డిస్కౌంట్ :
ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16499 గా ఉంది. తొలి సేల్‌లో భాగంగా ICICI, SBI, HDFC బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ మోడల్స్ ధరలు రూ.13999, రూ.15499 గా ఉంది.
పుల్ HD+ డిస్‌ప్లే :
లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా ఈ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.
#PlayUltra5G - Sale Starts: Tomorrow, 12PM.
— Lava Mobiles (@LavaMobile) August 24, 2025
Priced at 👇🏻
6GB+128GB - ₹13,999*
8GB+128GB - ₹15,499*
✅ 2.5GHz MediaTek Dimensity 7300 Processor (4nm) – 7,00,000+ AnTuTu Score
✅ Premium Glossy Back Design & Much More
To know more - https://t.co/XjNgO6AjhF
*Incl. of Bank Offers pic.twitter.com/OJCcy6XQQV
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
లావా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని లావా చెబుతోంది.
ఫాస్ట్ ఛార్జింగ్ :
బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 45 గంటల వరకు టాక్ టైమ్ వస్తుందని లేదా 510 గంటల వరకు స్టాండ్‌బై టైంను అందిస్తుందని లావా చెబుతోంది.
64MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఇందులో 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది. అయితే ఈ కెమెరాలు HDR, బ్యూటీ, పొర్ట్రెయిట్, నైట్‌మోడ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో మోడ్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంటాయి.
ఈ లావా హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా హ్యాండ్‌సెట్ 5G, 4G, WiFi 6, బ్లూటూత్ 5.3, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది


Click it and Unblock the Notifications








