రూ.12,999 ధరకే 64MP కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్, అమోలెడ్ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్..!
భారత్ మార్కెట్ లో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ లకు అధిక డిమాండ్ ఉంటోంది. అనేక స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లు ఈ ధరలో ఫోన్ లను లాంచ్ చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో లాంచ్ అయిన లావా ప్లే అల్ట్రా 5G స్మా్ర్ట్ ఫోన్ ను ( Lava Play Ultra 5G Smartphone ) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ డిజైన్ ఆకట్టుకుంటుంది. మరియు 64MP కెమెరా, HD + డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
5G ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్ :
లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16,499 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్ లో ఈ ఫోన్ ను రూ.2 వేల డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు.

రూ.12999 ధరకే :
ప్రస్తుతం ఈ ఫోన్ ధరలు రూ.12999, రూ.14,499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఫలితంగా మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఆర్కిటిక్ ప్రాస్ట్, ఆర్కిటిక్ స్కేట్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లే :
లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్ తో అందుబాటులో ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
ఆండ్రాయిడ్ 15, 3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
లావా హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.

64MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాతో అందుబాటులో ఉంది. మరియు 13MP ను అమర్చారు. ఈ కెమెరాలు నైట్ మోడ్, స్లో మోషన్, ప్రో మోడ్, HDR, బ్యూటీ, పొర్ట్రెయిట్, టైమ్ ల్యాప్స్ వంటి ఫీచర్లున్నాయి.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, OTG :
ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.3, Wi-Fi 6, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్ లతో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








