Home
Mobile

బడ్జెట్ ధరలో 64MP కెమెరా, ఫ్లాట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 3 సంవత్సరాల అప్‌డేట్స్‌తో స్మార్ట్‌ఫోన్‌!

భారత్‌ మార్కెట్‌ లో లావా నుంచి ఇటీవల కాలంలో అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. అయితే గత సంవత్సరం ఆగస్టులో బడ్జెట్‌ ధరలో లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 64MP కెమెరా, ఆకట్టుకొనే డిజైన్, ఫ్లాట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతోపాటు 3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతుంది. బడ్జెట్‌ ధరలో ఫోన్‌ కోసం చూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్‌ ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

రూ.15998 ధరకు :
లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ (Lava Play Ultra 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15998, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17499 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులపై గరిష్ఠంగా రూ.1500 వరకు డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Lava Play Ultra 5G Smartphone

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ లావా స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

ఫ్లాట్‌ అమోలెడ్ డిస్‌ప్లే :
ఈ ఫోన్‌ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ ఫ్లాట్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌ తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ ఫోన్ ఆర్కిటిక్‌ స్లేట్‌, ఆర్కిటిక్‌ ప్రాస్ట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

64MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరా యూనిట్‌ ను కలిగి ఉంది. ఇందులో 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 5MP మ్యాక్రో లెన్స్‌ ఉంది. ఈ ఫోన్‌ ప్రైమరీ కెమెరా ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ (EIS) సపోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 13MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్ :
ఈ ఫోన్‌ కెమెరా విభాగం టైమ్‌ ల్యాప్స్‌, బ్యూటీ, పొర్ట్రెయిట్‌, స్లో మోషన్‌, ప్రో మోడ్, నైట్ మోడ్‌, HDR వంటి ఫీచర్లను సపోర్టు చేస్తుంది. ఈ లావా ప్లే అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

లావా స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై 6, బ్లూటూత్‌ 5.3, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సపోర్టుతో డ్యూయల్‌ మైక్రోఫోన్స్‌ ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Play Ultra 5G Smartphone with 64MP sony camera now available at Rs15998 price on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X