మొదటి సారి వస్తున్నాం.. ఆశీర్వదించండి

Posted By: Staff

మొదటి సారి వస్తున్నాం.. ఆశీర్వదించండి

తక్కువ ధరలో మొబైల్స్‌ని విడుదల చేస్తున్న లావా మొబైల్స్ మార్కెట్లోకి కొత్తగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి కొత్త మొబైల్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దాని పేరు 'లావా ఎస్12'. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3.2 ఇంచ్‌లుగా రూపొదించడంతో పాటు, స్క్రీన్ రిజల్యూషన్ 480 x320 ఫిక్సల్‌గా తయారు చేయడం జరిగింది.

ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో గూగుల్ ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది. స్క్రీన్ డిస్ ప్లే HVGA TFT టచ్ స్క్రీన్ డిస్ ప్లే‌తో తయారు చేయబడింది. 600 MHz పవర్ పుల్ క్వాలికామ్ 7227 ప్రాసెసర్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. ఇందులో ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయవచ్చు. మొబైల్‌తో పాటు కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పైలను కూడా సపోర్ట్ చేస్తుంది. మొబైల్ బరువు 120 గ్రాములు. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కు కనెక్టు చేసుకునేందుకు 3.5 mm ఆడియో జాక్ ప్రత్యేకం. బ్యాటరీ బ్యాక్‌అప్ పవర్ పుల్‌గా ఉండేందుకు గాను ఇందులో 1300 mAh lithium-Ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. 'లావా ఎస్12' మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా...

'లావా ఎస్12' మొబైల్ ప్రత్యేకతలు:

* ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.2 (Froyo)
* యూజర్ ఇంటర్‌ఫేస్: 3D UI with 16 customizable home screens
* అప్లికేషన్స్: Yes, 21 Pre-Loaded
* కీబోర్డ్: SlideIT keyboard - Lava is the first Indian smart-phone to collaborate with Slide IT
* ప్రాసెసర్: 600 MHz Qualcomm Processor
* స్క్రీన్ సైజు: 3.2 inches HVGA (480x320), Capacitive touch
* కెమెరా: 5MP with zoom
* కనెక్టివిటీ ఫీచర్స్: 3G up to 7.2Mbps, Wi-Fi, Bluetooth, Portable Wi-Fi hotspot
* మెమరీ కార్డు: 120 MB Internal Storage, Expandable up to 32GB, 2GB card included
* బ్యాటరీ: 1300 mAh
* చుట్టుకొలతలు: 117 x 57.5 x 13.4 mm
* మొబైల్ ధర సుమారుగా రూ: 10, 000/-

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting