Home
Mobile

రూ.6999 ధరకే 50MP AI కెమెరా, 5000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్ విడుదల..!

లావా నుంచి త్వరలో అగ్ని 4 5G ఫోన్ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే ఈ హ్యాండ్‌సెట్‌ గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఎంట్రీ లెవల్ ధరలో లావా నుంచి మరో ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. క్లిన్‌ సాఫ్ట్‌వేర్ అనుభూతిని అందిస్తుంది. ఈ లావా షార్క్‌ 2 4G స్మార్ట్‌ఫోన్ (Lava Shark 2 4G Smartphone Launched) స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర, సేల్‌ పూర్తి వివరాలు.

లావా షార్క్‌ 2 4G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌ తో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. పంచ్‌ హోల్ కటౌట్‌ డిజైన్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

Lava Shark 2 4G smartphone launched with 5000mAh Battery  50MP AI Camera in india

వర్చువల్‌ ర్యామ్ ఫీచర్ :
ఈ లావా హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్‌ UNISOC T7250 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 4GB ర్యామ్, 64GB స్చోరేజీతో జతచేసి ఉంది. వర్చువల్‌ ర్యామ్‌ ఫీచర్‌ తో అదనంగా 4GB వరకు ర్యామ్‌ ను పొడిగించుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌తోపాటు రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇంటి వద్దనే ఉచితంగా సర్వీస్‌ చేయించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉందని లావా తెలిపింది.

కెమెరా విభాగం పరంగా ఈ లావా షార్క్ 2 4G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP AI కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. USB- C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్‌తో 10W ఛార్జర్‌ ను అందిస్తుంది.

లావా షార్క్ 2 4G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ :
ఈ లావా షార్క్‌ 2 4G స్మార్ట్‌ ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.6999 గా ఉంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ స్టోర్స్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ఎక్లిప్స్ గ్రే, అరోరా గోల్డ్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఫ్లాట్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 7000mAh లేదా అంతకంటే పెద్ద బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే లాంచ్‌ కానుందని భావిస్తున్న అగ్ని 4 5G ఫోన్‌ ఇటీవలే BIS సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌ లో కనిపించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Shark 2 4G smartphone launched with 5000mAh Battery, 50MP AI Camera in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X