Home
Mobile

ఆకట్టుకొనే డిజైన్‌, HD+ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా భారత్‌ మార్కెట్‌ లో త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేయనుంది. గతంలో లాంచ్ అయిన లావా షార్క్‌ 5G ఫోన్‌ కు తర్వాత తరం వెర్షన్‌ గా లావా షార్క్‌ 2 మోడల్‌ ను (Lava Shark 2 Smartphone) విడుదల చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల తేదీ వెల్లడి కాలేదు. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి.

గ్లోసీ బ్యాక్‌ డిజైన్‌ :
ఇటీవ వెల్లడైన వివరాల ఆధారంగా లావా షార్క్ 2 స్మార్ట్‌ఫోన్‌ గ్లోసీ బ్యాక్‌ డిజైన్‌ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ బ్లాక్, సిల్వర్‌ వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. లావా బోల్డ్‌ N1 ప్రో తరహా కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. షార్క్ 2 ఫోన్‌ వెనుక వైపు 50MP కెమెరాను కలిగి ఉంటుంది.

lava shark 2 smartphone

డిస్‌ప్లే వివరాలు :
తాజాగా వెల్లడైన వివరాల ఆధారంగా లావా షార్క్ 2 స్మార్ట్‌ఫోన్‌ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం ఈ హ్యాండ్‌సెట్‌ పంచ్‌ హోల్‌ కటౌట్‌ను కలిగి ఉంటుంది. లావా X పోస్ట్‌ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

లావా షార్క్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ టీజర్‌ ఫోటోల ఆధారంగా ఎడమ వైపు సిమ్ ట్రే ఉంటుంది. కుడి వైపున పవర్, వాల్యూమ్‌ బటన్స్‌ ఉంటాయి. ఈ ఫోన్‌ స్పీకర్‌ గ్రిల్, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.

లావా షార్క్ 5G స్మార్ట్‌ఫోన్ :
ప్రస్తుతం భారత్ మార్కెట్‌ లో అందుబాటులో ఉన్న లావా షార్క్ 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.7999 గా ఉంది. ఈ ఫోన్ స్టెల్లర్‌ బ్లూ, స్టెల్లర్‌ గోల్డ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రీమియం గ్లోసీ డిజైన్‌ను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 15 :
లావా షార్క్‌ 5G స్మార్ట్‌ఫోన్ 6nm ఆక్టా కోర్‌ Unisoc T765 ప్రాసెసర్‌ తో అందుబాటులో ఉంది. ఈ ప్రాసెసర్‌ 4GB LPDDR4x ర్యామ్‌, 64GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 13MP కెమెరా, ముందువైపు 5MP సెల్పీ కెమెరాను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
lava shark 2 smartphone key specifications revealed ahead of expected launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X