రూ.7999 కే 5000mAh బ్యాటరీ, 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
భారత్ మార్కెట్‌లో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్ ఉంటోంది. అందువల్ల అనేక స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రూ.10 వేల కంటే తక్కువ ధరలో అనేక మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా రూ.7999 కే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా షార్క్ 5G పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
లావా షార్క్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
లావా షార్క్ 5G స్మార్ట్‌ఫోన్ (Lava Shark 5G Smartphone) 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.75 అంగుళాల (1612 x 720 పిక్సల్స్) HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన ప్రీమియం గ్లోసీ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ లావా స్మార్ట్‌ఫోన్ 6nm ఆక్టా కోర్ Unisoc T765 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 4GB LPDDR4x ర్యామ్ మరియు 64GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ద్వారా అదనంగా 4GB ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది.
రూ.7999 ధరకే :
ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ధర రూ.7999 గా ఉంది. ప్రస్తుతం లావా రిటైల్ స్టోర్స్‌తోపాటు సంస్థ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. SD కార్డు ద్వారా 512GB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

సంవత్సరం వారంటీ :
ఈ ఫోన్ కొనుగోలుపై 1 సంవత్సరం వరకు వారంటీని అందిస్తోంది. దీంతోపాటు ఇంటి వద్దే సర్వీసింగ్ అవకాశం కూడా కల్పిస్తోంది. ఈ ఫోన్ స్టెల్లర్ గోల్డ్, స్టెల్లర్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. తక్కువ ధరలో లేటెస్ట్ ఫోన్ కోసం చూసే వారికి ఈ హ్యాండ్‌సెట్ అనుకూలంగా ఉంటుంది.
5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా లావా షార్క్ 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 13MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే ఫోన్‌తోపాటు 10W ఛార్జర్‌ను పొందవచ్చు.
లావా ఎంట్రీ లెవల్ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తోపాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, 4F VoLTE, బ్లూటూత్ 5.0, వైఫై 802.11, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
లావా యువ స్టార్ 2 :
మే నెల తొలి వారంలో లావా యువ స్టార్ 2 పేరుతో ధర రూ.6499 కే విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 60Hz రీఫ్రెష్ రేట్‌తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా కోర్ UNISOC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత (గో ఎడిషన్) పైన పనిచేస్తోంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP ప్రైమరీ కెమెరా, AI లెన్స్, LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. ముందువైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్‌లాక్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4G నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications








