రూ.7999 ధరకే 5G స్మార్ట్‌ఫోన్.. 5000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే సహా ఆకట్టుకొనే డిజైన్..!
ఎంట్రీ లెవల్ మోడల్స్‌కు భారత్‌లో మంచి డిమాండ్ ఉంటోంది. ఫలితంగా అనేక సంస్థలు ఈ ధర సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఈ సంవత్సరం మే నేలలో లావా షార్క్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.7999 గా ఉంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. మరియు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
లావా షార్క్ 5G స్మార్ట్‌ఫోన్ (Lava Shark 5G Smartphone) 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.750 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ స్టెల్లర్ బ్లూ, స్టెల్లర్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.

లావా షార్క్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
లావా షార్క్ 5G స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. మరియు ప్రీమియం గ్లోసీ డిజైన్‌తో అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ 15 :
ఈ హ్యాండ్‌సెట్ 6nm ఆక్టా కోర్ Unisoc T765 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4x ర్యామ్, 64GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ లావా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది.
5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరా, ముందువైపు 5MP సెల్పీ కెమెరాను కలిగి ఉంది. మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే ఫోన్ రిటైల్ బాక్స్‌లో 10W ఛార్జర్‌ను అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను కలిగి ఉంది.
* లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ :
గత నెల చివరి వారంలో లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఆర్కిటిక్ ప్రాస్ట్, ఆర్కిటిక్ స్కేట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16499 గా ఉంది.
లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications








