రూ.8999 ధరకు ఆకట్టుకొనే డిజైన్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్!
లావా సంస్థ భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్ లను విడుదల చేసింది. లావా స్ట్రోమ్ లైట్ 5G, స్ట్రోమ్ ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ప్రస్తుతం లైట్ వేరియంట్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. రూ.10 వేల ధరలో ఈ ఫోన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.
లావా స్ట్రోమ్ లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (Lava Storm Lite 5G Smartphone) ప్రస్తుతం 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9499 గా ఉంది. ఈ ఫోన్ కాస్మిక్ టైటానియం, అస్ట్రాల్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
లావా స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలున్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను కలిగి ఉంది.
మీడియాటెక్ చిప్, ఆండ్రాయిడ్ 15 OS ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌తోపాటు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

5000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ :
భారత్ మార్కెట్‌లో ఈ నెలలో లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.16999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు డిస్‌ప్లేలను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 1.6 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB LPDDR5 ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX752 సెన్సర్, మరో కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది.


Click it and Unblock the Notifications








