రూ.7999, రూ.9999 ధరలకే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా తాజాగా భారత్ మార్కెట్‌లో లావా స్టార్మ్ ప్లే 5G, లావా స్టార్మ్ లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. రూ.10 వేల ధర వేరియంట్‌లో 5G ఫోన్‌ల కోసం చూసే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ హ్యాండ్‌సెట్స్‌ను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్‌లు 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 6.75 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.
లావా స్టార్మ్ ప్లే స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ (Lava Strom Play 5G Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి వచ్చినా.. ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.

చిప్‌సెట్ పరంగా ఈ స్టార్మ్ ప్లే స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ LPDDR5x ర్యామ్, UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. సాధారణంగా ఈ తరహా స్పెసిఫికేషన్‌లు మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉంటాయి. కానీ లావా ఈ ఎంట్రీ లెవల్ ఫోన్లలోనే అందించింది.
ఈ ఫోన్ 6GB ర్యామ్ + 6GB వర్చువల్ ర్యామ్ తోపాటు 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత (Boot Clean ad free) OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఒక ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌తోపాటు 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8MP కెమెరాను అమర్చి ఉంది.
Storm Play - World's First MediaTek Dimensity 7060
— Lava Mobiles (@LavaMobile) June 13, 2025
Processor*
Sale Starts 24 June, 12 PM only on Amazon
Price: ₹9,999
Get Notified: https://t.co/VxNQjcMnq3
*Source: Techarc (Smartphones under 10k) pic.twitter.com/jf6u8Kap6c
లావా స్టార్మ్ ప్లే 5G స్మార్ట్‌ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.9999 గా ఉంది. జూన్ 19 నుంచి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. హాం సర్వీస్ ఆప్షన్‌ను అందిస్తోంది.
లావా స్టార్మ్ లైట్ 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ (Lava Strom Lite 5G Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB LPDDR4x ర్యామ్, 64GB/128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఒక ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌తోపాటు, 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. కెమెరా విభాగం పరంగా 50MP, 2MP కెమెరాలతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Storm Lite 5G – Supports all major Indian 5G bands for uninterrupted connectivity.
— Lava Mobiles (@LavaMobile) June 13, 2025
Because rebels don’t wait to connect.
Starting ₹7,999
Sale Starts 19 June, 12 PM only on Amazon
Get Notified: https://t.co/SZG4tR38Ma#StormLite #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/Let6xGfZ0x
ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ ధర రూ.7999 గా ఉంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 24 నుంచి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లావా సంస్థ హాం సర్వీస్ ఆప్షన్‌ను అందిస్తోంది.


Click it and Unblock the Notifications