Home
Mobile

రూ.9999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ప్రీమియం డిజైన్‌తో 5G ఫోన్‌.. ఇవాళ్టి నుంచే సేల్‌..!

భారత్‌ మార్కెట్‌లో లావా సంస్థ గత వారం ఎంట్రీ లెవల్ ధరలో రెండు ఫోన్‌లను తీసుకొచ్చింది. లావా స్ట్రోమ్‌ ప్లే 5G, లావా స్ట్రోమ్‌ లైట్‌ 5G మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఇవా‌ళ్టి నుంచి స్ట్రోమ్‌ ప్లే 5G మోడల్‌ సేల్‌ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్‌లో 5G ఫోన్‌ కోసం చూసే వారికి ఈ హ్యాండ్‌సెట్ మంచి ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది.

లావా స్ట్రోమ్‌ ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌ (Lava Storm Play 5G Smartphone Sale) ప్రారంభ ధర రూ.9999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ఉచితంగా హోం సర్వీస్‌ ఆప్షన్‌ కూడా అందిస్తోంది.

Lava Storm Play 5g price

లావా స్ట్రోమ్‌ ప్లే 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
లావా స్ట్రోమ్‌ ప్లే 5G హ్యాండ్‌సెట్‌ ప్రీమియం గ్లోసీ బ్యాక్‌ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

చిప్‌సెట్‌ వివరాలు :
ఈ లావా స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చి‌ప్‌సెట్‌ LPDDR5x ర్యామ్‌, UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మిడ్‌ రేంజ్‌ ఫోన్‌లతోనే ఈ తరహా ర్యామ్‌, స్టోరేజీ స్పెసిఫికేషన్లు ఉంటాయి. అయితే లావా మాత్రం రూ.10 వేల ధర సెగ్మెంట్‌ ఫోన్‌లోనే ఈ స్పెసిఫికేషన్‌లు అందించింది.

Lava Storm Play 5g price

ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 6GB ర్యామ్ + 6GB (వర్చువల్‌ ర్యామ్), 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌తోపాటు, 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని లావా వెల్లడించింది.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
లావా స్ట్రోమ్‌ ప్లే 5G ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. మరియు ఈ ఫోన్‌ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ లావా స్ట్రోమ్ ప్లే 5G ఫోన్‌తో పాటు స్ట్రోమ్‌ లైట్‌ 5G మోడల్‌ కూడా లాంచ్‌ అయింది. లైట్‌ మోడల్‌ జూన్‌ 24 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభం ధర రూ.7999 గా ఉంది. అమెజాన్‌ ద్వారానే సేల్‌ ప్రారంభం కానుంది. హోం డెలివరీ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

లావా స్ట్రోమ్ లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP, 2MP కెమెరాలతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.. 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Lava Storm Play 5G smartphone at Rs9999 price sale to start from today on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X