Home
Mobile

6.78 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌ తో స్మార్ట్‌ఫోన్‌లు.. పూర్తి వివరాలు..!

భారత్‌ మార్కెట్‌లో గత నెలలో లావా రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. లావా షార్క్‌ హ్యాండ్‌సెట్‌తోపాటు లావా బోల్డ్‌ N1 సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు సిరీస్‌లు కూడా ఎంట్రీ లెవల్‌ ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో రెండు మోడల్స్‌ను లాంచే చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. త్వరలో భారత్‌ మార్కెట్‌లో లావా స్ట్రోమ్‌ ప్లే, లావా స్ట్రోమ్‌ లైట్‌ 5G ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి.

లావా స్ట్రోమ్‌ లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ :
లావా స్ట్రోమ్‌ లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ (Lava Storm Lite 5G Smartphone) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 6GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు విడుదల అనంతరం లావా ఇ-స్టోర్‌ తోపాటు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

lava Storm play and storm lite 5G Smartphones set to launch in india soon  specifications  features

లావా స్ట్రోమ్‌ ప్లే స్మార్ట్‌ఫోన్‌ :
లావా స్ట్రోమ్‌ ప్లే స్మార్ట్‌ఫోన్‌ (Lava Storm Play Smartphone) మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ LPDDR5X ర్యామ్‌, UFS 3.1 స్టోరేజీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ మెరుగైన డిజైన్‌తోపాటు 5G కనెక్టివిటీ సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు మెరుగైన గేమింగ్‌ అనుభూతిని అందిస్తుందని లావా చెబుతోంది.

* లావా బోల్డ్‌ N1 సిరీస్‌ :
లావా నుంచి గత నెలలో లావా బోల్డ్‌ N1, బోల్డ్ N1 ప్రో ఫోన్‌లు విడుదల అయ్యాయి. బోల్డ్‌ N1 ధర రూ.5999 గా ఉంది. బోల్డ్‌ N1 ప్రో ధర రూ.6699 గా ఉంది. ఈ రెండు ఫోన్‌లను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డిజైన్ పరంగా ఈ రెండు మోడల్స్‌ ఆకట్టుకుంటాయి.

లావా బోల్డ్‌ N1 స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ Unisoc ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Go Edition పైన పనిచేస్తుంది. 13MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

లావా బోల్డ్ N1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Unisoc T606 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌తోపాటు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తుంది.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్‌తోపాటు 10W ఛార్జర్‌ను పొందవచ్చు. ఈ రెండు ఫోన్‌లను ఇంటి వద్ద సర్వీస్‌ చేయించుకొనే అవకాశం ఉంది.

* మే నెలలోనే లావా షార్క్‌ 5G స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల అయింది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.7999 గా ఉంది. ఈ ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. Unisoc T765 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. 13MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
lava Storm play and storm lite 5G Smartphones set to launch in india soon. specifications, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X