Home
Mobile

రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరా, ఆకట్టుకొనే డిజైన్‌తో లావా స్మార్ట్‌ఫోన్‌..!

లావా నుంచి ఇటీవల భారత్‌ మార్కెట్‌ లో లావా అగ్ని 4 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అగ్ని 3 5G ఫోన్‌ కు తర్వాత తరం వెర్షన్‌ గా అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా కొత్త ఫోన్ టీజర్‌ ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ రెండు డిస్‌ప్లేతో లాంచ్‌ కానుందని పోస్టర్‌ ఆధారంగా తెలిసింది. షియోమీ 17 ప్రో, షియోమీ 17 ప్రో మ్యాక్స్‌ కూడా ఇదే తరహా డిజైన్‌ ను కలిగి ఉంది.

ఈ పేరుతోనే లాంచ్‌ కానుందా? :
లావా ఇప్పటికే డ్యూయల్‌ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. లావా బ్లేజ్‌ డుయో 5G, లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌లు ప్రైమరీ, ఇన్‌స్టా డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. అయితే లావా నుంచి త్వరలో లాంచ్ కానుందని భావిస్తున్న స్మార్ట్‌ఫోన్ లావా బ్లేజ్‌ డుయో 3 5G పేరుతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Lava teased new smartphone with dual displays

ఎంత ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? :
లావా బ్లేజ్‌ డుయో 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో రూ.16999 ధరకు విడుదల అయింది. అయితే లావా బ్లేజ్‌ డుయో 3 5G (Lava Blaze Duo 3 5G Smartphone) (ఈ పేరును లావా ధ్రువీకరించలేదు) ఫోన్‌ రూ.20000 ధర సెగ్మెంట్‌ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

50MP ప్రైమరీ కెమెరా :
లావా నుంచి త్వరలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగం వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరా ఉంటుంది. సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.

మీడియాటెక్‌ చిప్‌సెట్‌! :
ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌ తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌ 6GB LPDDR5 ర్యామ్‌, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

రెండు డిస్‌ప్లేలతో లాంచ్‌ :
లావా ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వెనుక వైపు 1.6 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ లు సహా అనేక విధాలుగా వెనుక వైపు ఉన్న డిస్‌ప్లే ఉపయోగపడుతుందని తెలుస్తోంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌ 7.55mm థిక్‌నెస్‌ తో స్లిమ్‌ డిజైన్‌, 181 గ్రాముల బరువును కలిగి ఉండే అవకాశం ఉంది.

లావా నుంచి త్వరలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్ ఏ పేరులో అందుబాటులోకి వస్తుందో లావా అధికారికంగా విడుదల కాలేదు. ఎప్పుడు విడుదల కానుందనే వివరాలను కూడా వెల్లడించలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava teased new smartphone with dual displays and 50MP Camera full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X