లావా 'రూటర్' ఫోన్ W150

Posted By: Super

లావా 'రూటర్' ఫోన్ W150

ఇండియన్ మొబైల్ ఇండస్ట్రీలో బ్రాండ్ మొబైల్‌గా వెలుగొందుతున్న వాటిల్లో లావా మొబైల్ కంపెనీ ఒకటి. తక్కవ ధరతో ఎక్కవ కాలం మన్నేటటువంటి మొబైల్స్‌ని విడుదల చేయడంలో లావా దిట్ట. లావా మొబైల్స్ ఇప్పుడు కొత్తగా నెట్ వర్కింగ్ రంగానికి సంబంధించి ఓ సరిక్రొత్త మొబైల్ పోన్‌ని విడుదల చేయనుంది. దాని పేరే 'లావా డబ్య్లు 150'.

లావా డబ్య్లు 150 మొబైల్ 2జీతో పాటుగా 3జీ ఫీచర్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ వై-పై ద్వారా ఈధర్ నెట్ వ్యాన్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. లావా డబ్య్లు 150 మొబైల్ డిజైన్ గనుక చూసినట్లైతే యూజర్స్ తప్పనిసరిగా ఆశ్చర్యానికి లోనవుతారు. ఇందులో నిక్షిప్తం చేసిన బ్యాటరీ మార్పు కష్టం. మొబైల్ బరువు 100గ్రాములు. ఇందులో నిక్షిప్తమైన ఫిజికల్ పవర్ స్విచ్ ద్వారా 2జీ, 3జీ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వవచ్చు.

మొబైల్ పాస్ వర్డ్‌ని ఎప్పుడైనా మరచిపోయినట్లైతే రూటర్‌లో ప్రత్యేకంగా ఉన్న రీసెట్ బటన్ ద్వారా తిరిగి పాత సెట్టింగ్స్‌ని పొందవచ్చు. ఈ మొబైల్‌లో ఉన్న మరో ప్రత్యేకత గీతలు, దుమ్ము, ధూళి నుండి మొబైల్‌ని కాపాడుతుంది. ఈ డివైజ్ ద్వారా పర్సనల్ కంప్యూటర్స్, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్‌కి ఇంటర్నెట్ కనెక్షన్‌కి అనుసంధానం చేయవచ్చు. లావా డబ్ల్యు 150 ప్రత్యేకతలను క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే...

* Supports EVDO and 3G data cards
* Upto 32 users on Local LAN
* Range up to 50 m
* Wireless Access Point & Gateway
* Standard USB port
* Ethernet LAN port
* Plug and Play – no need to instal hardware drivers
* Wireless LAN WiFi 802.11 b/g/n
* Portable Sleek Deisgn
* Secure Access through WEP, WPA – Built in Firewall
* Battery : Lion Battery-2300mAH, Upto 4 hours stand alone usage
* Dimension : 94x61x14.7
* Weight : 100 g

లావా డబ్ల్యు 150 మొబైల్ ధర సుమారుగా రూ: 3, 199.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot