అదిరే ఫీచర్లతో అలరిస్తున్న లావా స్మార్ట్‌ఫోన్

Written By:

మార్కెట్లో మనకు కావలిసిన బడ్జెట్లో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి.అయితే వాటిలో ఏది మంచిదో తెలియక ఏది బడితే అది కొనేస్తుంటాం..కొన్న తరువాత అయ్యో అది బాగాలేదే అని బాధపడుతుంటాం . అందుకే కొనేటప్పుడు ముందు జాగ్రత్తగా వివిధ రకాల ఫోన్ల గురించి తెలుసుకోవడం మంచిది. ఈ నేపధ్యంలో ఇండియాలో తయారైన లావా మొబైల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జియోమి,లెనోవా,మైక్రోమ్యాక్స్,ఇంటెక్స్ వంటివాటికి ధీటుగా మార్కెట్లో విడుదలయింది. దీని ధర రూ. 11,500. మరి దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అదిరిపోయే డిస్ ప్లే

5 ఇంచ్ డిస్ ప్లేను కలిగి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో చాలా హుందాగా కనిపిస్తుంది.డిస్ ప్లే లో వివిధ రకాల కలర్స్ అలాగే టెక్ట్స్ మనకు కనిపిస్తాయి. సన్ లైట్ తో చాలా కాంతివంతంగా కనిపిస్తుంది.

3జబి రామ్

ఈ ఫోన్ 3జిబి రామ్ తో హై స్పీడ్ ఫెర్పార్మెన్స్ కలిగి ఉంది. 3 జిబి రామ్ కలిగి ఉండటం వల్ల మీఫోన్ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు వేడెక్కడం లాంటివి జరగవు.

4జీ మాయ

లావా x10 డ్యూయెల్ సిమ్ సపోర్ట్ తో జీని కలిగి ఉంటుంది. 4జీ నెట్ వర్క్ తో మీరు చాలా వేగంగా బ్రౌజ్ చేయవచ్చు.

పవర్ పుల్ రేర్ కెమెరా

13మెగాఫిక్సల్ కెమెరా అతలాగే డ్యూయెల్ ఫ్లాష్ లైట్ తో ఫోటోలు తీసుకోవచ్చు. దీంతో పాటు హెచ్ డి వీడియోని రికార్డింగ్ చేయవచ్చు. వీడియోనుంచి స్టిల్ ఇమేజ్ తీసుకునే అవకాశం కూడా ఉంది.

వైడ్ యాంగిల్ లెన్స్ ఫర్ సెల్ఫీ

5 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరాతో వైడ్ యాంగిల్ ఫోటోలను తీయవచ్చు.

క్వాడ్ కోర్ సీపీయు

మీడియాటెక్ MT6735 CPU క్వాడ్ కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 1.3 ghz స్పీడ్ ను కలిగి ఉంది.

బ్యాటరీ

బ్యాటరీ కూడా చాలా పవర్ పుల్ గా ఉంటుంది. 2900 mAh లైఫో బ్యాటరీ. 3జీకి అయితే 209 గంటలు స్టాండ్ బై ఉంటుంది. 18 గంటల పాటు మాట్లాడుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 6.0

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో మీద రన్ అవుతుంది. ప్రస్తుతానికి 5.1 లాలీపాప్ ఉన్నా అతి త్వరలోనే 6.0 వర్సన్ అప్ డేట్ చేసే అవకాశం ఉంది.

స్టోరేజి

16జిబి ఇంటర్నల్ స్టోరేజ్. అలాగే 32 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం.

ఇతర ఫీచర్స్

వైఫై, బ్లూటూత్, జీపీఎస్,ఓటీజీ సపోర్ట్ ,3జీతో పాటు ఎయిర్ గెస్టర్స్ అలాగూ స్మార్ట్ గెస్టర్స్ కూడా ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write lava x10 did some say android heavyweight killer 10 points to prove
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot