కెవ్వు.. కేక, ఈ వారంలోనే విడుదల!!

Posted By: Super

కెవ్వు.. కేక, ఈ వారంలోనే విడుదల!!

 

స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు కొత్త సమాచారం. ఇంటెల్ మెడ్ ఫీల్డ్ ప్రాసెసర్ ఆధారితంగా పని చేసే తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ వారం దేశ వ్యాప్తంగా లాంఛ్ చేస్తున్నారు. లావా, ఇంటెల్ సంయుక్త భాగస్వామ్యంతో రూపొదించబడిన ఈ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్ పేరు ‘XOLO X900’. ఫిబ్రవరిలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రదర్శనలో ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు.

విడుదలకు సంబంధించి మార్కెట్ అంచనాలు ఆశాజనకంగా ఉన్పప్పటికి ధర అంశం బెంబేలెత్తిస్తుంది. లావా ఈ ఫోన్ విలువను ఇండియాలో రూ.25,000గా ప్రకటించింది. దేశంలో తక్కువ ప్రజాదరణ కలిగి ఉన్న లావా ఫోన్‌లకు వినియోగదారులు అంత వెచ్చిస్తారా..?, అన్న ప్రశ్న మార్కెట్ వర్గాలను కలవరానికిలోను చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో నెలకున్న పిరిస్థితుల దృష్ట్యా ఈ హ్యాండ్‌సెట్ ధర తగ్గుముఖం పట్టే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

‘XOLO X900’ కీలక స్పెసిఫికేషన్‌లు..

* 4.3 అంగుళాల హై రిసల్యూషన్ LCD డిస్‌ప్లే,

* ఇంటెల్ ఆటమ్ Z2460 ప్రాసెసర్, (క్లాక్ సామర్ధ్యం 1.6 GHz),

* ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్థ,

* నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ) వ్యవస్థ,

* HSPA + నెట్‌వర్క్ సపోర్ట్,

* హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

* ఇంటెల్ XMM6260 ప్లాట్‌ఫామ్.

క్యాండీ బార్ ఆక్ళతిలో డిజైన్ కాబడిన ఈ ఫోన్ పూర్తి స్థాయి టచ్ సౌలభ్యతతో పనిచేస్తుంది. ఏర్పాటు చేసిన స్ర్కీన్ పెద్ద తెర అనుభూతిని కలిగిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot