Home
Mobile

ధర రూ.9499 కే 50MP కెమెరా, నోటిఫికేషన్‌ లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌.. సంవత్సరం వారంటీ, ఇంటి వద్దే ఫ్రీ సర్వీస్‌..!

లావా నుంచి ఎంట్రీ లెవల్‌ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను (Lava Yuva 2 5G Smartphone launched) విడుదల అయింది. లావా యువ 2 5G పేరుతో భారత్‌ మార్కెట్‌లో లాంచ్ అయింది. రూ.10000 కంటే తక్కువ ధరలో ఈ ఫోన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఫోన్‌ డిజైన్‌ ఆకట్టుకొనే విధంగా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు నోటిఫికేషన్‌ లైట్‌ను కలిగి ఉంది. నోటిఫికేషన్‌లు, యాప్‌ అలె‌ర్ట్స్‌ కోసం ఈ లైట్‌ పనిచేస్తుంది.

లావా యువ 2 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ లావా స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే 700 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మార్బుల్‌ ఫినిష్‌ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.

Lava Yuva 2 5G Smartphone sale

ఈ హ్యాండ్‌సెట్‌ Unisoc T760 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 4GB ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. 4GB ర్యామ్‌ను అదనంగా పొడిగించుకొనే అవకాశం ఉంది. ఈ లావా 5G హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

1TB వరకు స్టోరేజీ సపోర్టు, 5000mAh బ్యాటరీ :
లావా కొత్త 5G హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా ఈ ఫోన్ స్టోరేజీని 1TB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 18W వైర్‌ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Lava Yuva 2 5G Smartphone sale

50MP AI ప్రైమరీ కెమెరా :
కెమెరాల పరంగా లావా యువ 2 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. AI ఆధారిత 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ వెనుక కెమెరా మాడ్యూల్‌ వద్ద నోటిఫికేషన్‌ లైట్‌ను అమర్చారు. ఇన్‌కమింగ్‌ కాల్స్‌, నోటిఫికేషన్‌ల సమయంలో ఈ లైట్‌ బ్లింక్‌ అవుతుంది. ఈ ఫోన్ మెరుగైన ఆడియో కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను అమర్చారు. మరియు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్‌ను అమర్చారు.

లావా యువ 2 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ : లావా యువ 2 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్టోరేజీ వేరియంట్ ధర రూ.9499 గా ఉంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ స్టోర్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండడంపై స్పష్టత లేదు.

లావా కొత్త 5G హ్యాండ్‌సెట్‌ మార్బుల్‌ వైట్‌, మార్బుల్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. సంవత్సరం పాటు వారంటీ సహా ఇంటి వద్దే ఉచితంగా సర్వీస్‌ అందిస్తామని లావా వెల్లడించింది. కనెక్టివిటీ పరంగా 5G (SA/ NSA), బ్లూటూత్‌, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. FM రేడియో ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Yuva 2 5G Smartphone launched with notification light, one year warranty in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X