ధర రూ.8999కే 50MP AI డ్యూయల్ కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్..!
భారత్ మార్కెట్‌లోకి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా నుంచి Lava Yuva 3 Pro ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ యూనిక్ డిజైన్ సహా మెరుగైన పనితీరు, ఫీచర్లను కలిగి ఉంది. తక్కువ ధరలోనే ప్రీమియం అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు తెలిపింది.
లావా యువ 3 ప్రో ధర : యువ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. డిసర్ట్ గోల్డ్, ఫారెస్ట్ విరిడియన్, మిడో పర్పల్ రంగుల్లో లభిస్తుందని సంస్థ వెల్లడించింది. లావా అధికారిక వెబ్‌సైట్ లేదా రిటైల్ దుకాణాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది.

లావా యువ 3 ప్రో స్పెసిఫికేషన్లు : లావా యువ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీప్రెష్ రేట్‌తో వస్తుంది. మరియు 720*1600 పిక్సల్ రిజల్యూషన్‌తో వస్తుంది. 269 ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. మరియు పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తుంది.
ఈ లావా కొత్త స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ Unisoc T616 చిప్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఈ ఫోన్ ర్యామ్‌ను 16GB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OSను కలిగి ఉంటుంది.

లావా యువ 3 ప్రో బ్యాటరీ : లావా కొత్త స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌లో 500 గంటల స్టాండ్‌బై టైంను లేదా 38 గంటల టాక్‌టైంను కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది.
యువ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ కెమెరా : ఆ స్మార్ట్‌ఫోన్ AI ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) ఆధారిత 50MP డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. HDR, పొట్రాయిట్, పనోరమ, బరస్ట్, స్లో మోషన్, నైట్, టైమ్ ల్యాప్స్ ఫోటోగ్రఫీ సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 8MP కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 4G VoLTE, బ్లూటూత్ 5, GPRS, OTG, వైఫై 802.11, USB-C ఛార్జింగ్ పోర్టు మరియు 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. భద్రత కోసం ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ లాక్ ఫీచర్లను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








