ధర రూ.6,999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఇంటివద్దనే Free సర్వీస్..!
భారత్ మార్కెట్లో కొన్ని ప్రముఖ సంస్థలు ఎంట్రీ లెవల్ ధరలో స్మార్ట్‌ఫోన్ల ను లాంచ్ చేస్తున్నాయి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రూ.10,000 కంటే తక్కువ ధరలో ఫోన్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇటీవల టెక్నో, షియోమీ సంస్థలు ఈ ధర సెగ్మెంట్‌లో ఫోన్‌లను లాంచ్ చేశాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా భారత్ మార్కెట్లోకి ఇవాళ యువ 4 స్మార్ట్‌ఫోన్ (Lava Yuva 4 Smartphone Launched) విడుదల చేసింది.
భారతీయ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా రూ.6999 ధరకే Lava Yuva 4 4G స్మార్ట్‌ఫోన్‌ను (Lava Yuva 4 4G Smartphone Price) లాంచ్ చేసింది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లను కలిగి ఉంది. డిజైన్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ పంచ్ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. హోం సర్వీస్‌ను ఉచితంగా అందిస్తోంది.

లావా యువ 4 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
లావా యువ 4 4G స్మార్ట్‌ఫోన్ పంచ్ హోల్ డిజైన్‌తో కూడిన 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 1600*720 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. గ్లోసీ వైట్, గ్లోసీ పర్పుల్, గ్లోసీ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
లావా స్మార్ట్‌ఫోన్ Unisoc T606 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 4GB ర్యామ్‌తో ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా అదనంగా 8GB వరకు పొడిగించుకొనే అవకాశం ఉంది. 4GB ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. మైక్రో SD కార్డుతో 512GB వరకు పొడిగించుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 14 (Out of the box) ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ లావా యువ 4 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ మరియు 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో విడుదల అయ్యాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ LED ఫ్లాష్ లైట్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ లావా కొత్త 4G స్మార్ట్‌ఫోన్ 10W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
లావా యువ 4 4G స్మార్ట్‌ఫోన్ ధర :
లావా యువ 4 4G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.6999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై సంవత్సరం పాటు వారంటీని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. మరియు ఇంటి వద్దనే ఉచిత సర్వీస్ అందిస్తామంది. రిటైల్ అవుట్‌లెట్ మరియు లావాతో భాగస్వా్మ్యం కుదుర్చుకున్న స్టోర్‌లకు తన ఉత్పత్తులు వేగంగా చేరేలా రిటైల్ ఫస్ట్ స్ట్రాటజీని ఈ నవంబర్ నుంచే ఎంచుకుంది.


Click it and Unblock the Notifications








