Home
Mobile

50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ ఖరారు.. పూర్తి వివరాలు..!!

Lava నుంచి భారత్‌ మార్కెట్‌లోకి కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. లావా యువ 5G స్మార్ట్‌ఫోన్‌ (Lava Yuva 5G Smartphone) విడుదలకు సంబంధించిన టీజర్‌ను సంస్థ తాజాగా విడుదల చేసింది. మే 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లావా కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

లావా సంస్థ విడుదల చేసిన టీజర్‌ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను గుర్తించవచ్చు. దీంతోపాటు ముందువైపు పంచ్‌ హోల్‌ను కలిగి ఉంది. మ్యాటీ ఫినిష్‌తో కూడిన గ్లాస్‌ బ్యాక్‌ను కలిగి ఉంటుంది.

Lava Yuva 5G Smartphone to launch in india on may 30

కెమెరా విభాగం పరంగా ఈ లావా యువ 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు AI డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ లావా యువ 5G స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌లో మోడల్‌ నంబర్‌ LXX513 తో కనిపించింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. దీంతోపాటు ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ లావా యువ 5G స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఛార్జింగ్‌ సామర్థం వివరాలు తెలియలేదు. భారత్‌ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ.10,000 కంటే తక్కువ ఉంటుందని తెలుస్తోంది. దీనిపై లావా సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

గత నెలలో లావా సంస్థ రెండు స్మార్ట్‌వాచ్‌లను భారత్‌లో విడుదల చేసింది. లావా ప్రోవాచ్‌ Vn మరియు లావా ప్రో వాచ్‌ Zn లాంచ్‌ అయ్యాయి. Vn మోడల్‌ బేస్‌ వేరియంట్‌గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.1999 కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే హైఎండ్‌ మోడల్‌ Zn ప్రారంభ ధర రూ.2599 గా ఉంది. ఈ రెండు వాచ్‌లపై 24 నెలల వారంటీని సంస్థ అందించింది.

లావా ప్రోవాచ్‌ Vn స్మార్ట్‌వాచ్‌ 1.96 అంగుళాల TFT 2.5D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 150కి పైగా వాచ్‌ ఫేస్‌లు, 115 కి పైగా ఇన్‌బిల్ట్‌ స్పోర్ట్‌ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఇవి ఫిట్‌నెట్‌ ట్రాకింగ్‌ కోసం పనిచేస్తాయి. హార్ట్‌ రేట్ మానిటరింగ్‌, SPO2 ట్రాకర్‌, ఒత్తిడి, స్లీప్‌ ట్రాకర్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌ IP67 రేటింగ్‌తో వాటర్‌ మరియు డస్ట్ రెసిస్టెంట్‌ను కలిగి ఉన్నాయి.

లావా ప్రోవాచ్‌ Zn స్మార్ట్‌వాచ్‌ 1.43 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌ కోసం VC9202 + VP60A PPG సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు బ్లడ్‌ ఆక్సిజన్‌ను ట్రాకింగ్‌ చేయనుంది. దీంతోపాటు ఒత్తిడి, శ్వాస, స్లీప్‌ మానిటర్‌ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 150 కంటే ఎక్కువ వాచ్‌ ఫేస్‌లను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ 110 స్పోర్ట్స్‌ మోడళ్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Yuva 5G Smartphone launch date confirmed in india here are the confirmed specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X