రూ.7 వేల‌లో Lava నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌.. ఫీచ‌ర్లు చూస్తే షాకే!

|

ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Lava, స‌రికొత్త మోడ‌ల్ మొబైల్‌ను భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. ఇటీవ‌లె అత్యంత స‌ర‌స‌మైన ధ‌ర‌లో Lava Blaze 5Gని ఆవిష్క‌రించిన కంపెనీ, తాజాగా Lava Yuva Pro పేరుతో స‌రికొత్త‌ మోడ‌ల్ మొబైల్‌ను సోమ‌వారం భార‌త మార్కెట్లో లాంచ్ చేసింది. కొత్త Lava Yuva Pro త‌క్కువ ధ‌ర‌లోనే అత్యుత్తమ‌ ఫీచర్లను క‌లిగి ఉంద‌ని కంపెనీ పేర్కొంది. దీన్ని మ‌రో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ గా కంపెనీ అభివ‌ర్ణించింది.

 
రూ.7 వేల‌లో Lava నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌.. ఫీచ‌ర్లు చూస్తే ష

దేశంలోని యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని, లావా ఈ మొబైల్ కు గ్లాస్ మాదిరి బ్యాక్ ప్యానెల్‌ను అందించింది. ఈ మొబైల్ బ్యాక్‌సైడ్ 13MP క్వాలిటీతో ప్ర‌ధాన కెమెరాతో పాటు ట్రిపుల్-కెమెరా సెటప్ మరియు ఇమ్మర్సివ్ డిస్‌ప్లే ను క‌లిగి ఉంది.

భారతదేశంలో Lava Yuva Pro ధర:
భార‌త మార్కెట్లో కొత్త Lava Yuva Pro ధరను రూ.7,799 గా కంపెనీ నిర్ణ‌యించింది. కొనుగోలుదారులు మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మరియు మెటాలిక్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో మొబైల్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ప్రస్తుతం, ఈ స్మార్ట్‌ఫోన్ లావా ఇండియా వెబ్‌సైట్‌లో విక్రయానికి సిద్ధంగా ఉంది. మీరు రూ.8వేల‌ లోపు ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మంచి ఎంపిక అని చెప్పొచ్చు.

Lava Yuva Pro ఫీచర్లు, స్పెసిఫికేష‌న్లు:
Lava Yuva Pro స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. బడ్జెట్ ధ‌ర‌లో ప్రీమియం ఫీచర్లు అందిస్తున్నార‌ని చెప్పొచ్చు. దీనిక 720 x 1600 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌తో 6.51-అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ఇది అన్ని ర‌కాల ప‌నుల‌కు అనుకూలంగా ఉంటుందని కంపెనీ వెల్ల‌డించింది. ఈ Lava Yuva Pro మొబైల్ MediaTek ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. అంతేకాకుండా, Lava Yuva Pro మొబైల్ 3GB RAMని 32GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో వస్తోంది. మరింత మెమరీ విస్తరణ కోసం లావా ప్రత్యేక మైక్రో SD కార్డ్ ఫీచ‌ర్‌ను కూడా అందించింది.

రూ.7 వేల‌లో Lava నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌.. ఫీచ‌ర్లు చూస్తే ష

ఇక కెమెరాల విష‌యానికొస్తే.. Lava Yuva Pro మొబైల్ బ్యాక్‌సైడ్ 13MP ప్రైమరీ షూటర్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మిగిలిన రెండు కెమెరాలు షూటర్‌లకు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. Lava Yuva Pro సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది మెరుగైన భద్రత కోసం ఫేస్ అన్‌లాక్‌కు స‌పోర్టు క‌లిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. Lava Yuva Pro మొబైల్ 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో జత చేసిన 5,000 mAh బ్యాటరీతో వ‌స్తోంది. ఇది 4G, డ్యూయల్ సిమ్, Wi-Fi, బ్లూటూత్ మరియు 3.5mm ఆడియో జాక్ వంటి సాధారణ కనెక్టివిటీల‌ మద్దతుతో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో ర‌న్ అవుతుంది. అయితే, అధికారిక వెబ్‌సైట్ మాత్రం సాఫ్ట్‌వేర్ వివరాలను పేర్కొనలేదు.

 

భార‌త మార్కెట్లో కొత్త Lava Yuva Pro ధరను రూ.7,799 గా కంపెనీ నిర్ణ‌యించింది. కొనుగోలుదారులు మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మరియు మెటాలిక్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో మొబైల్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ప్రస్తుతం, ఈ స్మార్ట్‌ఫోన్ లావా ఇండియా వెబ్‌సైట్‌లో విక్రయానికి సిద్ధంగా ఉంది. మీరు రూ.8వేల‌ లోపు ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మంచి ఎంపిక అని చెప్పొచ్చు. కాగా, ఈ కంపెనీ ఇటీవ‌లె అత్యంత స‌ర‌స‌మైన ధ‌ర‌లో Lava Blaze 5G మొబైల్‌ ని ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే.

Best Mobiles in India

English summary
Lava Yuva Pro New 5G mobile launched in india with low cost of Rs.7,799.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X