Home
Mobile

రూ.6000 ధరలో 5000mAh బ్యాటరీ, 6.75 అంగుళాల భారీ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌..!

లావా నుంచి భారత్‌ మార్కెట్‌ లోకి ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌ లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ కేవలం రూ.6000 లో అందుబాటులోకి వచ్చింది. లావా యువ స్మార్ట్ పేరుతో (Lava Yuva Smart Smartphone) ఈ స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. ఇప్పటికే గత డిసెంబర్‌లో భారత్‌ లో లావా యువ 2 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. యువ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత ఫీచర్‌లను సపోర్టు చేస్తుందని లావా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

లావా యువ స్మార్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ :
లావా యువ స్మార్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.6000 గా ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. సంవత్సరం వారంటీ సహా ఇంటి వద్దనే సర్వీస్‌ వంటి ప్రయోజనాలను అందిస్తున్నట్లు లావా వెల్లడించింది. లావా కొత్త స్మార్ట్‌ఫోన్‌ గ్లోసీ బ్లూ, గ్లోసీ లావెండర్‌, గ్లోసీ వైట్‌ రంగుల్లో లభిస్తుంది.

Lava Yuva smart price

లావా యువ స్మార్ట్‌ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.75 అంగుళాల (720*1600) HD+ భారీ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 60Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. డిజైన్‌ పరంగా హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌, వీడియో స్ట్రీమింగ్‌ కు ఈ భారీ డిస్‌ప్లేను అనుకూలంగా ఉంటుంది.

ఈ లావా కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 గో ఎడిషన్‌ పైన పనిచేస్తుంది. మరియు Unisoc 9863A ఆక్టా కోర్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 3GB ర్యామ్‌, 64GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. అదనంగా 3GB ర్యామ్‌ వర్చువల్‌ గా పొడిగించుకొనే అవకాశం ఉంది.

Lava Yuva smart price

ఫలితంగా రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం 3GB ర్యామ్ + 64GB స్టోరేజీతో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డుతో 512GB స్టోరేజీ వరకు పొడిగించుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా పొందనుంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 13MP ప్రైమరీ కెమెరా సహా AI ఆధారిత మరో కెమెరాను అమర్చారు. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా కలిగి ఉంది. ఈ కెమెరాలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత HDR, పొర్ట్రెయిట్‌, నైట్‌ మోడ్‌ ఫీచర్‌లును కలిగి ఉంది.

దీంతోపాటు ఈ కెమెరాలు స్లో మోషన్‌ వీడియోను కూడా సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం లావా యువ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్ 5MP కెమెరాను అమర్చారు. సెల్ఫీ కెమెరా వాటర్‌ డ్రాప్‌ స్టై్‌ల్‌ నాచ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 10W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా లావా హ్యాండ్‌సెట్ 4G VoLTE, బ్లూటూత్ 4.2, వైఫై 5, USB-C, OTG వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ మరియు ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌లను అమర్చారు. డ్యూయల్‌ సిమ్‌ కార్డులను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్‌ 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. దీంతోపాటు బ్యాటరీ సేవర్‌ మోడ్, QR కోడ్ స్కానర్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. రూ.6000 ధర సెగ్మెంట్‌లో ఈ హ్యాండ్‌సెట్ బెస్ట్ ఆప్షన్‌లో ఒకటిగా ఉంటుంది. దీంతోపాటు సంవత్సరం వారంటీని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Yuva smart smartphone launched with 5000mAh battery and large display in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X