Home
Mobile

రూ.6499 కే 5000mAh బ్యాటరీ, 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్‌లు, సేల్‌ వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా ఇవాళ భారత్ మార్కెట్‌లో ఎంట్రీ లెవల్‌ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా యువ సిరీస్‌లో కొత్త హ్యాండ్‌సెట్‌ను లాంచ్‌ చేసింది. గత సంవత్సరం లావా యువ స్టార్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాగా.. తాజాగా లావా యువ స్టార్ 2 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్‌ మంచి ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది.

లావా యువ స్టార్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ లావా స్మార్ట్‌ఫోన్‌ (Lava Yuva Star 2 Smartphone) 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది. ఎంట్రీ లెవల్‌ ధరలో ఈ ఫోన్ సౌకర్యంగా ఉంటుంది.

lava yuva star 2 smartphone launched

ఆండ్రాయిడ్‌ 14, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ :
ఈ లావా హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్‌ UNISOC ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ గరిష్ఠంగా 4GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. అయితే వర్చువల్‌గా 4GB ర్యామ్ వరకు అదనంగా పొడిగించుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత (గో ఎడిషన్‌) పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ఆధారంగా 512GB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 13MP ప్రైమరీ కెమెరాతోపాటు AI లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా అమర్చారు. సైల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఎంట్రీ లెవల్‌ మోడల్‌లో 5000mAh బ్యాటరీ :
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో ఒక్కరోజు అంతా ఉపయోగించుకోవచ్చని లావా చెబుతోంది. కాల్‌ రికార్డింగ్ కోసం ప్రత్యేక ఫీచర్‌ను అందిస్తున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌లాక్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 4G VoLTE, బ్లూటూత్‌ 4.2, వైఫై 802, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. FM రేడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది.

లావా యువ స్టార్ 2 స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు :
లావా యువ స్టార్ 2 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.6499 గా ఉంది. ఈ ధరలోనే 5000mAh బ్యాటరీ, క్లీన్ ఆండ్రాయిడ్‌, ఆకట్టుకొనే డిజైన్‌ వంటి అనేక ఫీచర్‌లు ఉన్నాయి. రేడియంట్‌ బ్లాక్‌, స్పార్కింగ్‌ ఐవరీ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఆన్‌లైన్‌ లభ్యత పై స్పష్టత రావాల్సి ఉంది.

* భారత్‌ మార్కెట్‌లో గత నెలలో లావా షార్క్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల అయింది. ఈ ఫోన్ ధర రూ.6999 గా ఉంది. టైటానియం గోల్డ్‌, స్టెల్త్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

లావా షార్క్‌ ఫోన్‌ UNISOC T606 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 OS పైన పనిచేస్తోంది. 50MP AI కెమెరాతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

Best Mobiles in India

English summary
lava yuva star 2 smartphone launched with 5000mAh battery in india, sale is live
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X