Home
Mobile

రూ.7499 ధరకు స్మార్ట్‌ఫోన్.. 5000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే, సంవత్సరం వరకు ఇంటి వద్దనే FREE సర్వీస్‌!

Lava Yuva Star 3 Smartphone : భారత్ మార్కెట్‌ లో ఎంట్రీ లెవల్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. లావా సంస్థ యువ స్టార్‌ 3 పేరుతో ఈ ఫోన్‌ ను విడుదల చేసింది. తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చినా... ఆకట్టుకొనే డిజైన్ సహా అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. సంవత్సరం వరకు ఇంటివద్దనే ఉచితంగా సర్వీస్‌ ఆఫర్‌ ను అందిస్తుంది. HD+ డిస్‌ప్లే, IP64 రేటింగ్, 5000mAh బ్యాటరీ ఉన్నాయి.

లావా యువ స్టార్‌ 3 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
లావా యువ స్టార్‌ 3 స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంది. వీడియో స్ట్రీమింగ్‌, ఆన్‌లైన్ క్లాస్‌లకు ఈ ఫోన్‌ అనుకూలంగా ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

Lava Yuva Star 3 Smartphone

ఆండ్రాయిడ్ 15 OS :
ఈ లావా స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Go ఎడిషన్‌ పైన పనిచేస్తుంది. ప్రస్తుతం 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌ లో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డుతో 512GB స్టోరేజీ వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉందని లావా తెలిపింది.

LED ఫ్లాష్ లైట్‌, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరా, LED ఫ్లాష్‌ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి రోజంతా వినియోగించుకోవచ్చనని చెబుతోంది.

కనెక్టివిటీ పరంగా 4G VoLTE, బ్లూటూత్‌ 4.2, వైఫై, GPS, FM రేడియో, 3.5mm ఆడియో జాక్‌, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ కింది వైపు స్పీకర్‌ ఉంది. ఈ ఫోన్‌ 193.7 గ్రాముల బరువు ఉంది. ఈ ఫోన్‌ రెండు సిమ్‌ కార్డులను సపోర్టు చేస్తుంది.

రెండు కలర్‌ వేరియంట్స్ :
లావా యువ స్టార్‌ 3 స్మా్ర్ట్‌ఫోన్‌ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఉంది. ఈ ఫోన్‌ ఇండస్‌ బ్లాక్, సియాచిన్‌ వైట్ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

లావా యువ స్టార్‌ 3 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ :
ఈ లావా స్మార్ట్‌ఫోన్ (Lava Yuva Star 3 Sale) 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7499 గా ఉంది. మార్చి నెల నుంచి ఈ ఫోన్‌ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. సంవత్సరం వరకు ఇంటి వద్దనే ఉచితంగా సర్వీస్‌ చేస్తామని లావా హామీ ఇస్తోంది. త్వరలో కచ్చితమైన సేల్‌ తేదీ వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Lava Yuva Star 3 Smartphone launched in india with 5000mAh battery, one year of free service at home, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X