Home
Mobile

లావా నుంచి సరికొత్తగా జడ్91 స్మార్ట్‌ఫోన్

దేశీయ మొబైల్స్ తయారీదారీ దిగ్గజం లావా తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్91ను మార్కెట్లోకి విడుదల చేసింది.ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది.

By Hazarath Aiah

దేశీయ మొబైల్స్ తయారీదారీ దిగ్గజం లావా తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్91ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. కాగా ఈ ఫోన్ బ్లూ రంగులో 18:9 wide-screen డిస్ ప్లేతో పాటు గ్లాస్ ఫినిష్ ను కూడా ఇందులో పొందుపరిచారు. ఈ ఫోన్‌లో 5.7 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం ఇచ్చారు. ఈ కెమెరాతో డివైస్‌ను కేవలం 0.7 సెకండ్ల వ్యవధిలోనే ఫేస్ ద్వారా అన్‌లాక్ చేసుకోవచ్చు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. రూ.9,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు మరో వారం రోజుల తరువాత మార్కెట్‌లో లభ్యం కానుంది. దేశవ్యాప్తంగా లక్ష రీటెయిల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

Lava Z91

లావా జడ్91 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Lava Z91 smartphone launched in India, priced at Rs 9,999 More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X