LeEco ఫోన్‌ల పై ఆఫర్ల సునామీ

తన సంచలనాత్మక సూపర్‌ఫోన్‌లతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రివ్వున దూసుకొచ్చిన LeEco అదే ఊపుతో ముందుకు సాగుతోంది. తన లీ1ఎస్ స్మార్ట్‌పోన్ ఆవిష్కరణతో జనవరి, 2016లో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన లీఇకో ఆ తరువాత వెనక్కితిరిగి చూడలేదు. ఇటీవల లీఇకో తన సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది.

Read More : షాకింగ్: రూ.49,990 విలువ చేసే ఫోన్ రూ.15,490కే

LeEco ఫోన్‌ల పై ఆఫర్ల సునామీ

Le 2, Le Max2 మోడల్స్‌లో విడుదలైన ఈ ఫోన్‌లకు మార్కెట్లో చెక్కుచెదరని ఆదరణ లభిస్తోంది. లీమాక్స్2 ఫోన్ హైఎండ్ మార్కెట్లో తన సత్తాను చాటుకోగా, లీ2 పవర్‌ఫుల్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి లీఇకో నిర్వహించిన మొదటి ఫ్లాష్ సేల్‌లో 61,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. Flipkartలో Le 2 ఫోన్‌లను కొనుగోలు చేసిన 82శాతం యూజర్లు, ఈ ఫోన్‌కు 4.2/5 రేటింగ్ ఇచ్చారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీఇకో లీ2 ఫోన్ ప్రత్యేకతలు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఇన్‌సెల్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్ విత్ స్నాప్‌‌డ్రాగన్ 652 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఈయూఐ 5.8 ఇంటర్‌ఫేస్.

లీఇకో లీ2 ఫోన్ ప్రత్యేకతలు

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్, ఎఫ్/2.0 అపెర్చర్ వంటి ప్రత్యేకతలతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ( ఎఫ్/2.0 అపెర్చర్, 76.5 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ సౌకర్యంతో), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4జీ ఎల్టీఈ కనెక్టువటీ, యూఎస్బీ టైప్ సీ, సీడీఎల్ఏ టైప్ సీ ఇయరో ఫోన్స్ సపర్ట్.

లీఇకో మాక్స్ 2 ప్రత్యేకతలు

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ రెటీనా డిస్‌ప్లే విత్ 2కే రిసల్యూషన్, 2.15 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ ( ఫోన్‌ను 5 నిమిషాల ఛార్జ్ చేస్తే 3.5 గంటల టాక్ టైమ్‌ను పొందవచ్చు), 4జీ ఎల్టీఈ కనెక్టువటీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, సెన్స్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సీడీఎల్ఏ టైప్ సీ ఇయరో ఫోన్స్ సపర్ట్.

సీడీఎల్ఏ స్టాండర్ట్

ఈ రెండు ఫోన్‌లు ప్రపంచపు మొట్టమొదటి సీడీఎల్ఏ స్టాండర్ట్ పోర్టులతో వస్తున్నాయి. రూ.4,999 విలువ చేసే లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌‌ను ఈ హ్యాండ్‌సెట్‌ల కొనుగోలు పై లీఇకో ఆఫర్ చేస్తోంది. ఏడాది పాటు వర్తించే ఈ ఉచిత ప్యాకేజీ ద్వారా యూజర్లు 2000 పై చిలుకు సినిమాలు, 1.9 మిలియన్ల పాటలు, 3000 పై
చిలుకు క్యూరేటెడ్ ప్రదర్శనలు ఇంకా 150 పై చిలుకు టీవీ ఛానళ్లను ఆస్వాదించవచ్చు.

సూపర్‌టెయిన్‌మెంట్

తమ సూపర్‌టెయిన్‌మెంట్ ప్రోగ్రామ్‌లో యూజర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు Eros Now, YuppTV, Hungama వంటి ప్రముఖ కంపెనీలతో LeEco ఒప్పందం కుదర్చుకుంది.

 

లీమాక్స్ ఇక పై ఓపెన్ సేల్ పై

లీ2, లీ మాక్స్2 సూపర్ ఫోన్‌లకు సంబంధించి ఇప్పటి వరకు రెండు ఫ్లాష్ సేల్స్‌ను లీఇకో విజయవంతంగా పూర్తి చేసింది. లీమాక్స్ ఇక పై ఓపెన్ సేల్ పై అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలు పై అనేక ఆసక్తికర ఆఫర్లను లీఇకో అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

లీ మాక్స్ 2 కొనుగోలు పై ఉచిత ఆఫర్లు

లీ మాక్స్2 ఫోన్‌ కొనుగోలు పై రూ.1,990 విలువ చేసే సీడీఎల్ఏ ఇయర్‌ఫోన్‌లను ఉచితంగా పొందవచ్చు.
జూలై 6 నుంచి జూలై8లోపు ప్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ లను కొనుగోలు చేసే సిటీ బ్యాండ్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లు 10శాతం
క్యాష్‌బ్యాక్‌ను పొందే అవకాశం.
రూ.4,900 విలువ చేసే ఏడాది ఉచిత లీఇకో మెంబర్‌‍షిప్ ప్రోగ్రామ్‌ను ఈ రెండు ఫోన్‌ల పై లీఇకో ఆఫర్ చేస్తోంది.
వొడాఫోన్ డబుల్ డేటా ఆఫర్‌ను యూజర్లు పొందవచ్చు.

లీ2 మూడవ ఫ్లాష్ సేల్

లీ2 ఫోన్‌లకు సంబంధించిన మూడవ ఫ్లాష్ సేల్ జూలై 12 మాధ్యహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ LeMall.com అలానే Flipkartలలో జూలై 12, మధ్యాహ్నం 11 గంటల వరకు కొనసాగుతుంది.

 

లీ2 ఫోన్ కొనుగోలు పై లభించే ఉచిత ఆఫర్లు

రూ.4,900 విలువ చేసే ఏడాది ఉచిత లీఇకో మెంబర్‌‍షిప్ ప్రోగ్రామ్‌ను లీఇకో ఉచితంగా. అందిస్తోంది.ఫ్లిప్‌కార్ట్ యూజర్లు వొడాఫోన్ డబుల్ డేటా ఆఫర్‌ను యూజర్లు పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Le 2 to go on 3rd flash sale on July 12, Le Max2 now on open sale!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot