Home
Mobile

మెటల్ బాడీతో కేక పుట్టిస్తోన్న LeEco సూపర్ ఫోన్స్

By Sivanjaneyulu Bommu

ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ డిజైన్ ట్రెండ్స్ ఓ సారి పరిశీలించినట్లయితే LeEco ఆకట్టుకునే డిజైనింగ్ స్పెక్స్‌తో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు చేరువయ్యింది. మెటల్ బాడీ ఛాసిస్‌కు పెద్దపీట వేస్తూ లీఇకో ఇటీవల లాంచ్ చేసిన Le 2, Le Max2 సూపర్‌ఫోన్‌లు ప్రొఫెషనల్ లుక్స్‌తో క్లాసీ అప్పీల్‌ను సొంతం చేసుకుంటున్నాయి.

Read More : మహిళలు ఉపయోగించే గదుల్లో రహస్య కెమెరాలను గుర్తించటం ఎలా..?

మెటల్ బాడీతో కేక పుట్టిస్తోన్న LeEco సూపర్ ఫోన్స్

రూ.11,999 ధర ట్యాగ్‌లో లభ్యమవుతోన్న పాకెట్ సైజ్ సూపర్‌ఫోన్ లీ2 తన ప్రత్యేకమైన మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తుంటే, ఇదే ధర రేంజ్‌లో అందుబాటులో ఉన్న ఇతర బ్రాండెడ్ ఫోన్‌లు మాత్రం ప్లాస్టిక్, పాలీకార్బొనేట్ బాడీలతో వస్తున్నాయి. లీ2 ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఇన్‌సెల్ డిస్‌ప్లే స్ర్కీన్ ఖరీదైన ఫీల్‌ను చేరువ చేస్తుంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్‌తో పోలిస్తే Le 2 ఫోన్ 39 గ్రాముల తక్కువ బరువును కలిగి ఉండటం విశేషం.

Read More : ఈ ఫోన్‌లు మీ బడ్జెట్‌కు పూర్తి న్యాయం చేస్తాయి

ప్రపంచపు శక్తివంతమైన ప్రాసెసర్‌తో

ప్రపంచపు శక్తివంతమైన ప్రాసెసర్‌తో

లీఇకో ప్లాగ్ షిప్ కిల్లర్ ఫోన్ Le Max2 ప్రపంచపు శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తోంది. పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఈ హైఎండ్ ఫోన్‌లో Qualcomm ®SnapdragonTM 820 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు.

 

మెటల్ బాడీతో వచ్చే ఫోన్‌లలో

మెటల్ బాడీతో వచ్చే ఫోన్‌లలో

మెటల్ బాడీతో వచ్చే ఫోన్‌లలో ఓవర్ హీటింగ్ సమస్యలు ఎక్కువుగా ఉంటాయని పలువురు అపోహ పడుతున్నారు. ఈ అపోహలో ఎటువంటి వాస్తవం లేదు!. లీఇకో సూపర్‌ఫోన్‌ల తయారీలో భాగంగా ఉపయోగించిన మెటల్ లోహం, ఫోన్ కాంపోనెంట్లు విడుదల చేసే వేడిని వేగంగా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా హీటింగ్ సమస్యలు అంతగా ఉండవు.

 

పాలీకార్బోనేట్ బాడీతో వచ్చే ఫోన్‌లలో

పాలీకార్బోనేట్ బాడీతో వచ్చే ఫోన్‌లలో

ప్లాస్టిక్ అలానే పాలీకార్బోనేట్ బాడీతో వచ్చే ఫోన్‌లలో హీటింగ్ తగ్గటానికి చాలా సమయం తీసుకుంటుంది.

స్టైలిష్ రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో

స్టైలిష్ రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో

తాజాగా విడుదలైన కొత్త వర్షన్ లీఇకో సూపర్‌ఫోన్‌లు స్టైలిష్ రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఉన్నాయి. ఈ కలర్ వేరియంట్‌లో లభ్యమయ్యే ఫోన్‌లు అదనపు లుక్ ను తీసుకువస్తాయి. మార్కెట్లో లభ్యమవుతోన్న అన్ని ఇన్-స్టైల్ యాక్సెసరీస్ ఈ ఫోన్‌లతో మ్యాచ్ అవుతాయి.

 

కటింగ్ ఎడ్జ్ డిజైన్‌తో వస్తోన్న Le 2 హ్యాండ్‌సెట్‌లో

కటింగ్ ఎడ్జ్ డిజైన్‌తో వస్తోన్న Le 2 హ్యాండ్‌సెట్‌లో

విప్లవాత్మక కటింగ్ ఎడ్జ్ డిజైన్‌తో వస్తోన్న Le 2 హ్యాండ్‌సెట్‌లో Octa-Core Qualcomm ® Snapdragon TM 652 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఆకట్టుకుంటాయి.

 

 Le Max2 రెండు వేరియంట్‌లలో

Le Max2 రెండు వేరియంట్‌లలో

హై-ఎండ్ కాంబో స్సెక్స్‌తో వస్తోన్న Le Max2 రెండు వేరియంట్‌లలో అందుబాటలో ఉంది. వాటి వివరాలు... 4జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ మెమరీ, 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ మెమరీ.

ఫాస్ట్ ఫోకసింగ్ టెక్నాలజీతో కెమెరా...

ఫాస్ట్ ఫోకసింగ్ టెక్నాలజీతో కెమెరా...

ఫాస్ట్ ఫోకసింగ్ టెక్నాలజీతో కూడిన 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. ఫోన్ ఫ్రంట్ యాంగిల్‌లో అమర్చిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్‌కు నిర్వహించుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
Le 2 and Le Max2 with metal body chassis set trend, help define your design statement. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X