రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

Written By:

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ లీఇకో నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ లీ 1ఎస్ ( Le 1s) మార్కెట్లో తన సత్తాను చాటుతోంది. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియమ్‌తో వస్తోన్న ఈ పూర్తి మెటల్ బాడీ ఫోన్ తన స్ర్కూ‌లెస్ ఇండస్ట్రీయల్ డిజైనింగ్‌తో ఫోన్ అసెంబ్లింగ్ ప్రక్రియలోనే విప్లవాత్మక ఒరవడికి నాంది పలికింది. హైఎండ్ ఫోన్‌లలో మాత్రమే ఆఫర్ చేసే బీజిల్ లెస్ డిజైన్, ఫుల్ ఫ్లోటింగ్ గ్లాస్ వంటి క్లాసికల్ ఫీచర్లను లీ 1ఎస్ ఫోన్‌లో మీరు చూడొచ్చు.

 రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

మార్కెట్లో ఇటీవల విడుదలైన రెడ్మీ నోట్3తో పోలిస్తే లీ 1ఎస్ ఫోన్ 7.5 మిల్లీ మీటర్ల మందంతో 13 శాతం స్లిమ్ గా ఉంటుంది. లీ 1ఎస్ సూపర్ ఫోన్ లో పొందుపరిచిన పూర్తి ఫ్లోటింగ్ గ్లాస్ డిజైన్ అత్యుత్తమ స్ర్కీన్ ప్రొటెక్షన్ ను చేరువచేయటంతో పాటు స్ర్కీన్ బ్రేకేజ్ రిస్క్ ను 70 శాతం వరకు తగ్గిస్తుంది. ఏర్పాటు చేసిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డివైస్ కు మరింత రక్షణనిస్తుంది. ఇప్పటికే అనేక ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టిన లీ1ఎస్ అతి తక్కువ సమయంలోనే #1 sold Smartphone onlineగా గర్తింపు తెచ్చుకుంది. మరిన్ని వివరాలు క్రింది స్లైడ్‌షోలో..

Read More : విదేశాల్లో వాడిపారేసిన ఐఫోన్లు ఇండియాలోకి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

పూర్తి bezel-less మెటల్ డిజైన్‌తో వచ్చిన లీ 1ఎస్ ఫోన్ మొట్టమొదటి యునిబాడీ మెటల్ ఫోన్‌గా మార్కెట్లో గుర్తింపు తెచ్చుకుంది.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియమ్‌ పరిపూర్ణతతో కూడిన మెటల్ యుని-బాడీ డిజైనింగ్ Le 1sకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

స్ర్కూలెస్ ఇండస్ట్రీయల్ డిజైనింగ్‌తో రూపుదిద్దుకున్న ఏకైక మెటల్ బాడీ ఫోన్‌లుగా LeEco సూపర్‌ఫోన్స్ గుర్తింపు తెచ్చుకున్నాయి.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఐఫోన్ 6ఎస్ ప్లస్ బరువుతో లీ 1ఎస్ బరువును పోల్చి చూసినట్లయితే లీ 1ఎస్ ఫోన్ ఐఫోన్ కంటే 23 గ్రాముల తక్కువ బరువును కలిగి ఉంటుంది.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

సిగ్నల్ ఫెర్మామెన్స్ విషయంలోనూ ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ను లీ 1ఎస్ ఫోన్ అధిగమించింది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ సిగ్నల్ ఫెర్మామెన్స్‌తో పోల్చి చూసినట్లయితే 2జీ, 3జీ నెట్‌వర్క్ పై 18 శాతం , 4జీ నెట్‌వర్క్ పై 24 శాతం, వైఫై నెట్‌వర్క్ పై 13 శాతం నాణ్యతలను లీ 1ఎస్ ఫోన్ కలిగి ఉంది.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

లీ 1ఎస్ ఫోన్ అనేక విశిష్టమైన ఫీచర్లతో వస్తోంది. ఈ బడ్జెట్ ప్రెండ్లీ ఫోన్‌లో పొందుపరిచిన డ్యుయల్ సిమ్ 4జీ వై-ఫై బ్యాండ్ ఫీచర్ కేవలం హెచ్‌టీసీ వన్ ఎమ్9+లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ.41,000.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

లీ 1ఎస్ ఫోన్ శక్తివంతమైన ఆక్టా కోర్ 2.2గిగాహెర్ట్జ్ హీలియో ఎక్స్10 టర్బో ప్రాసెసర్‌తో వస్తోంది. హైఎండ్ సామ్‌సంగ్ , హెచ్‌టీసీ ఫోన్‌లలో పొందుపరిచిన క్వాడ్‌కోర్, మీడియాటెక్ చిప్‌సెట్‌లతో ఇది పోటీ పడగలదు.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

ఈ పవర్ హౌజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లో పొందపరిచిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

ఇక బ్యాటరీ పవర్ విషయానికొస్తే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 (3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ), హెచ్‌టీసీ వన్ ఎమ్9+ (2840ఎమ్ఏహె బ్యాటరీ)లతో లీ 1ఎస్ ఫోన్ పోటీ పడుతోంది.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ లో ఏర్పాటు చేసిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మన్నికైన బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుంది. లీ 1ఎస్ ఫోన్‌లో పొందుపరిచిన క్విక్ చార్జింగ్ టెక్నాలజీ 5 నిమిషాలకు 3.5 గంటల టాక్ టైమ్‌ను ఇస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ చార్జింగ్ కోసం పరితపించే బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు ఈ సదుపాయం మరింతగా ఉపయోగపడుతుంది.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

యూఎస్బీ టైప్ - సీ కనెక్టువిటీ LeEco ఫోన్‌లకు మరో ప్రధాన ఆకర్షణ.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

మిర్రర్ సర్ ఫేసుడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

రూ.10,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతున్న లీ1ఎస్ ఫోన్, ప్రపంచపు మొట్టమొదటి మిర్రర్ సర్‌ఫేస్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. 5.5 అంగుళాల FHD డిస్‌ప్లే, హీలియో ఎక్స్ 10 టర్బో ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్ కార్డ్‌స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అంశాలు లీ1ఎస్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

లీ1ఎస్ ఫోన్ చైనా మార్కెట్లో టాప్ సెల్లర్‌గా నిలవటం విశేషం. అక్కడి మార్కెట్లో గతేడాది అక్టోబర్ లో విడుదలైన ఈ ఫోన్ లు కేవలం రెండు నెలల వ్యవధిలో 2 మిలియన్ యూనిట్లు అమ్ముడవటం విశేషం. వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాపత్ంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 1s: A budget smartphone with narrow screen bezel and premium specs. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot