దిగ్గజాలకు దడ పుట్టిస్తోన్న Le Max2!

|

ఒకప్పుడు ప్రీమియమ్ క్వాలిటీ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.40,000 నుంచి రూ.50,000 వరకు వెచ్చించాల్సి వచ్చేది. కాలక్రమేనా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో చోటుచేసుకున్న విప్లకవాత్మక మార్పులు బ్రాండ్‌ల మధ్య మరింత పోటీని పెంచింది. ఫలితందా రూ.25,000లోపే టాప్ క్లాస్ ఫీచర్లతో కూడిన బ్రాండ్ క్వాలిటీ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయ్.

దిగ్గజాలకు దడ పుట్టిస్తోన్న Le Max2!

 

LeEco నుంచి ఇటీవల రూ.22,999 ధర ట్యాగ్‌తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్ Le Max2, మార్కెట్ టాప్ మోడల్స్ అయిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 (ధర రూ.48,900), ఐఫోన్ 6ఎస్ (రూ.54,600), హెచ్‌టీసీ 10 (రూ.54,500) ఫోన్‌లకు అన్ని విభాగాల్లోనూ కఠినమైన సవాల్ విసురుతోంది.

డిస్‌ప్లే కేక

డిస్‌ప్లే కేక

5.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో ఎక్విప్ కాబడిన Le Max2 స్మార్ట్‌ఫోన్‌ 2560×1440 పిక్సల్ సూపర్ క్వాలిటీ 2కే రిసల్యూషన్ క్వాలిటీతో గెలాక్సీ ఎస్7 (5.1 అంగుళాలు), ఐఫోన్ 6ఎస్ (5.5 అంగులాల), హెచ్‌టీసీ 10 (5.2 అంగుళాల) డిస్‌ప్లేలను అధిగమించగలిగింది.

21 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా

21 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా

కెమెరా విషయంలోనూ Le Max2 ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థతో వస్తోంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 21 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, బ్లర్-ఫ్రీ ఫోటోస్, పీడీఏఎఫ్ టెక్నాలజీ, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలతో ఆకట్టుకుంటుంది.

ఫ్రంట్ కెమెరా

ఫ్రంట్ కెమెరా

ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్పీలతో పాటు వీడియో రికార్డింగ్‌ను ఆస్వాదించవచ్చు.

ఆ స్మార్ట్‌ఫోన్‌లలో..
 

ఆ స్మార్ట్‌ఫోన్‌లలో..

మరోవైపు గెలాక్సీ ఎస్7, ఐఫోన్ 6ఎస్, హెచ్‌టీసీ 10 స్మార్ట్‌ఫోన్‌లు కేవలం 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఇంకా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో మాత్రమే వస్తున్నాయి.

లీ మాక్స్2 స్పెసిఫికేషన్స్...

లీ మాక్స్2 స్పెసిఫికేషన్స్...

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ రెటీనా డిస్‌ప్లే విత్ 2కే రిసల్యూషన్, 2.15 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 4జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ ( ఫోన్‌ను 5 నిమిషాల ఛార్జ్ చేస్తే 3.5 గంటల టాక్ టైమ్‌ను పొందవచ్చు), లీ మాక్స్ 2 ఫోన్ 4జీబి ఇంకా 6జీబి ర్యామ్ వేరింయంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.22,999. 6జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.29,999.

Most Read Articles
Best Mobiles in India

English summary
Le Max2: Raises the bar for the Flagship Battle. Read More in Telugu Gizbot...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X