లెనోవో నుంచి 5 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

బెర్లిన్ వేదికగా సెప్టంబర్ నెలలో నిర్వహించబోయే 2014 ఐఎఫ్ఏ టెక్నాలజీ షోకు లెనోవో ముస్తాబవుతోంది. ఈ గాడ్జెట్ షో వేదికగా లెనోవో ఓ స్మార్ట్‌వాచ్‌తో పాటు 5 సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచానికి పరిచయం చేయబోతోందని సమచారం.

లెనోవో నుంచి 5 స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో విడుదల చేయబోతున్న 5 స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో ‘ఎ786టీ' వేరియంట్ ఒకటి. ఈ ఫోన్ 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 64 బిట్  స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్‌ను అమర్చారు. 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఎల్టీఈకనెక్టువిటీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. లెనోవో విడుదల చేయబోతున్న మరో ఫోన్ ఎస్858టీ. ఈ ఫోన్ బరువు 99 గ్రాములు ఉంటుంది.ఈఫోన్‌ను సెప్టంబర్ మధ్యలో లెనోవో అందుబాటులోకి తీసుకురాబోతోంది.

లోనోవో రూపొందిస్తున్న ఆక్టా కోర్ ప్రాసెసర్ ఫోన్ వైబ్ ఎక్స్‌2 అక్టోబర్ లేదా నవంబర్ లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అపోలో యోగా పేరుతో ఫ్లిప్ ఫీచర్ ఫోన్‌ను లెనోవో త్వరలో విడుదల చేయనుంది. అలానే లెనోలో యోగా సిరీస్ పలు టాబ్లెట్ మోడళ్లను లెనోవో ఆవిష్కరించబోతోంది. ఏదేమైనప్పటికి లెనోవో కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన పూర్తి వివరాలు 2014 ఐఎఫ్ఏ టెక్నాలజీ షోలో వెల్లడికానున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot