రెండు రోజుల సేల్.. 100 కోట్ల వ్యాపారం

గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం LeEco తన సూపర్ క్వాలిటీ ఉత్పత్తులతో సంచలన సేల్‌ను భారత్‌లో నమోదు చేసింది. తన లీఇకో సూపర్ ఫోన్స్ అలానే సూపర్ టీవీల పై కనీవినీ డిస్కౌంట్‌లతో సెప్టంబర్ 19, 2016 నుంచి రెండు రోజుల పాటు భారత్‌లో నిర్వహించిన EPIC 919 SuperFan ఫెస్టివల్‌‌లో భాగంగా 100 కోట్ల పై చిలుకు అమ్మకాలను లీఇకో నమోదు చేసింది.

 రెండు రోజుల సేల్.. 100 కోట్ల వ్యాపారం

తొలత ఈ సేల్‌ను ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని నిర్వాహకులు అనుకున్నారు. అయితే, ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకునటంతో సేల్‌ను రెండో రోజుకు పొడగించారు. ఈ సేల్‌లో భాగంగా 70,000 పై చిలుకు సూపర్ ఫోన్‌లతో పాటు 2000 పై చిలుకు సూపర్ టీవీలు, 20,000 పై చిలుకు యాక్సెసరీలను లీఇకో విక్రయించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్ సహా చైనా, హాంకాంగ్ మార్కెట్లలో

భారత్ సహా చైనా, హాంకాంగ్ మార్కెట్లలో ఇప్పటి వరకు నిర్వహించిన EPIC 919 SuperFan ఫెస్టివల్స్‌లో భాగంగా మొత్తం 5,200 కోట్ల వ్యాపారం జరిగినట్లు లీఇకో వెల్లడించింది.

ఒక్క చైనా మార్కెట్లోనే

ఒక్క చైనా మార్కెట్లోనే 8,66,000 సూపర్ టీవీలతో పాటు 1,178,000 పై చిలుకు ఫోన్‌లను లీఇకో ఈ ఏడాది విక్రయించగలిగింది.

ఆన్‌లైన్ షాపర్లు బ్రహ్మరథం పట్టారు.

LeMall.comలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబడిన లీఇకో Accessoriesకు ఆన్‌లైన్ షాపర్లు బ్రహ్మరథం పట్టారు.  లీమాల్.కామ్ లో అందుబాటులో ఉంచి లీఇకో ఉపకరాణాలకు సంబంధించి 20,000 పై చిలుకు అమ్మకాలు జరిగినట్లు లీఇకో తెలిపింది.

ఉపకరణాల జాబితాలో

లీఇకో ఆఫర్ చేస్తున్న ఉపకరణాల జాబితాలో బ్లుటూత్ స్పీకర్స్, బ్లుటూత్ హెడ్‌ఫోన్స్, సీడీఎల్ఏ హెడ్‌సెట్స్, రివర్స్ ఇన్ ఇయర్స్, రింగ్ బ్రాకెట్స్, ఫోన్ కేసెస్, ఫోన్ కవర్స్ ఇంకా స్ర్కీన్ ప్రొటెక్టర్స్ ఉన్నాయి.

ఎక్స్‌క్లూజివ్‌గా..

భారత్‌లో EPIC 919 SuperFan ఫెస్టివల్‌ను leMall.com అలానే Flipkartలు ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహించాయి.

ఊహించిన స్థాయిలో రాయితీలో

EPIC 919 SuperFan ఫెస్టివల్‌లో భాగంలో లీఇకో సూపర్ ఫోన్స్ అలానే సూపపర్ టీవీల పై రూ.11,000 నుంచి రూ.25,000 వరకు రాయితీలను అందించింది.

రానున్న రోజుల్లో మరిన్ని షాపింగ్ ఫెస్టివల్స్

తమ EPIC 919 SuperFan ఫెస్టివల్‌కు భారతీయులు బ్రహ్మరథం పట్టడంతో రానున్న రోజుల్లో మరిన్ని షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహించేందుకు లీఇకో సిద్ధమవుతోంది.

లీఇకో అసలు పేరు Letv

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు. ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్ లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

వినియోగదారులకు మరింత భరోసాని

తమ వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాప్తంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. 10 లాంగ్వేజ్ ల్లో మీకు సర్వీసు అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Crosses Rs. 100 Crore Mark in their First Ever EPIC 919 Festival in India!.Read More in Telugu Gizbot Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot