4జీబి ర్యామ్, 21 ఎంపీ కెమెరా ఫోన్ పై రూ.5,000 తగ్గింపు!

టెక్నాలజీ దిగ్గజం LeEco తన వ్యాపార విస్తరణలో భాగంగా Amazon India, Snapdealతో చేతులు కలిపింది. తన లీమాక్స్2 స్మార్ట్‌ఫోన్‌ను మల్టీ-ప్లాట్‌ఫామ్ స్ట్రేటజీ క్రింద విక్రయించేందుకు లీఇకో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లీఇకో ఇప్పటికే తన సూపర్‌ఫోన్‌లను Flipkartలో విక్రయిస్తోన్న విషయం తెలిసిందే.

4జీబి ర్యామ్, 21 ఎంపీ కెమెరా ఫోన్ పై రూ.5,000 తగ్గింపు!

దేశవ్యాప్తంగా పండుగల షాపింగ్ ఊపందుకున్న నేపథ్యంలో లీఇకో తన లీమాక్స్2 ఫోన్ పై ఏకంగా రూ.5,000 తగ్గింపును ప్రకటించింది. లాంచ్ సమయంలో లీమాక్స్2 ఫోన్ ధర రూ.22,999గా ఉంది. తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.17,999కే మీరు సొంతం చేసుకోచ్చు. ఈ లిమిటెడ్ పరియడ్ ఆఫర్ Amazon, Flipkart, Snapdeal అలానే LeMallలో అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అక్టోబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు

అక్టోబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు స్పెషల్ ఫెస్టివల్స్ సేల్స్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో Amazon, బిగ్ బిలియన్ డేస్ పేరుతో Flipkart, అన్‌బాక్స్ దివాలీ సేల్ పేరుతో Snapdealలు ప్రత్యేకమైన షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ సేల్స్‌లో భాగంగా మీరు లీమాక్స్2 ఫోన్ లను రూ.5,000 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

 

అదనంగా రూ.1000 డిస్కౌంట్

మరోవైపు లీఇకో అధికారిక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన LeMall లీమాక్స్2 ఫోన్‌లకు సంబంధించి సెప్టంబర్ 30వ తేదీన స్పెషల్ సేల్ కండక్ట్ చేస్తోంది. ఈ సేల్‌లో భాగంగా లీమాక్స్2 ఫోన్‌ను కొనుగోలు చేసిన యూజర్లకు రూ.2000 ఖరీదు చేసే స్పెషల్ voucher లభిస్తుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీలోపు మాక్స్2 ఫోన్‌ను సొంతం చేసుకున్న యూజర్లకు రూ.1000 డిస్కౌంట్ అదనంగా లిభిస్తుందని LeMall తెలిపింది.

ఒకప్పుడు ప్రీమియమ్ క్వాలిటీ ఫోన్ అంటే..?

ఒకప్పుడు ప్రీమియమ్ క్వాలిటీ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.40,000 నుంచి రూ.50,000 వరకు వెచ్చించాల్సి వచ్చేది. కాలక్రమేనా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో చోటుచేసుకున్న విప్లకవాత్మక మార్పులు బ్రాండ్‌ల మధ్య మరింత పోటీని పెంచింది. ఫలితంగా రూ.20,000లోపే టాప్ క్లాస్ ఫీచర్లతో కూడిన బ్రాండ్ క్వాలిటీ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయ్.

 

లీమాక్స్2 ఫోన్ స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ రెటీనా డిస్‌ప్లే విత్ 2కే రిసల్యూషన్, 2.15 గిగాహెర్ట్జ్ Qualcomm® SnapdragonTM 820 (MSM8996) processor, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ , 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 4G VoLTE సపోర్ట్, 3జీ, వై-ఫై, బ్లుటూత్.

రూ.4,999 విలువ చేసే ఉచిత ప్యాకేజీ..

లీ మాక్స్2 స్మార్ట్‌ఫోన్‌ను కొనగోలు చేసే యూజర్లకు ఏడాది ఉచిత లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌ లభిస్తుంది. రూ.4,999 విలువ చేసే ఈ ఉచిత ప్యాకేజీ ద్వారా యూజర్లు అనేక సర్వీసులను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఈ Supertainment మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా యూజర్లు 2000కే సినిమాలు, 3.5 మిలియన్ల పాటలు, 150 పై చిలుకు లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. Eros Now, YuppTV, Hungama Musicల భాగస్వామ్యంతో లీఇకో ఈ సేవలను అందిస్తోంది.

io Welcome Offer

తమ సూపర్‌ఫోన్ యూజర్లకు "Jio Welcome Offer"ను అందించేందుకు, ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ LeEco రిలయన్స్ జియోతో చేతులు కలిపింది. దీంతో లీమాక్స్ 2 యూజర్లు తమ ఫోన్‌లో జియో సిమ్‌లను యాక్టివేషన్ చేసుకోవటం ద్వారా డిసెంబర్ 31,2016 వరకు జియో అందిస్తోన్న అన్ని సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఆ తరువాత బెస్ట్ జియో ప్లాన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

 

Le Max యూజర్లు...

జియో ఆఫర్ చేస్తున్న VoLTE కాల్స్‌ను Le Max యూజర్లు తమ ఫోన్‌లలో ఉన్న ఎల్టీఈ నెట్‌వర్క్ పై హైడెఫినిషన్ క్వాలిటీతో ఆస్వాదించవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco expands e-commerce partnerships With Amazon & Snapdeal. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot