LeEco కంపెనీ నుంచి మరో 3 సూపర్ ఫోన్స్
సంచలనం రేపుతోన్న చైనా ఫోన్‌ల కంపెనీ లీఇకో భారత్‌లో మరో మూడు సూపర్ ఫోన్‌లను లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. జూన్ 8న నిర్వహించే ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌లో భాగంగా లీ2, లీ2 ప్రో, లీ మాక్స్ 2 ఫోన్‌లను లీఇకో ఆవిష్కరించబోతోంది.

ఈ మూడు ఫోన్‌లు గత నెలలోనే చైనా మార్కెట్లో లాంచ్ అయి భారీ సక్సెస్‌ను అందుకున్నాయి. ప్రత్యేకమైన మెటల్ బాడీ డిజైన్, యూఎస్బీ టైప్ - సీ పోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అధునాతన ఫీచర్లు ఈ ఫోన్‌లకు వెన్నుదన్నుగా నిలవనున్నాయి. ఈ మూడు ఫోన్‌లకు సంబంధించిన ప్రత్యేకతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...
Read More : ఆ ఫోన్ కొంటే దిమ్మతిరిగే ఆఫర్లు

లీఇకో లీ2 ప్రత్యేకతలు
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080పిక్సల్స్), 2.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా కోర్ ప్రాసెసర్,

లీఇకో లీ2 ప్రత్యేకతలు
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 16 మెగా పిక్సల్ మెయిన్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 76.5 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, యూఎస్బీ టైప్ సీ, బ్లుటూత్ 4.2), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్.

లీఇకో లీ2 ప్రో ప్రత్యేకతలు
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080పిక్సల్స్), 2.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,

లీఇకో లీ2 ప్రో ప్రత్యేకతలు
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, 6 పిక్సల్ లెన్స్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 76.5 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, యూఎస్బీ టైప్ సీ, బ్లుటూత్ 4.2), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్.

లీఇకో లీ మాక్స్ 2 ప్రత్యేకతలు
5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440పిక్సల్ డిస్‌ప్లే, 2.15గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 4జీబి), ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (32జీబి, 64జీబి),

లీఇకో లీ మాక్స్ 2 ప్రత్యేకతలు
64జీబి), 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, 6 పిక్సల్ లెన్స్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 76.5 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

లీఇకో లీ మాక్స్ 2 ప్రత్యేకతలు
4జీ ఎల్టీఈ సపోర్ట్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, 3,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 క్వాల్కమ్ టెక్నాలజీ.


Click it and Unblock the Notifications








