లీ1ఎస్ ఇకో vs మోటో జీ4

Written By:

మోటో జీ4, మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో లెనోవో నేతృత్వంలోని మోటరోలా మిడ్ రేంజ్ మార్కెట్ పై మరింత పట్టు సాధించినట్లు కనిపిస్తోంది. ఈ రెండు ఫోన్‌లలో ఒకటైన జీ4 ప్లస్ ఇప్పటికే Amazon Indiaలో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోంది. మోటో జీ4 వచ్చే నెల నుంచి మార్కెట్లో లభ్యంకానుంది.

లీ1ఎస్ ఇకో vs మోటో జీ4

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఊపేసోన్న మరో స్మార్ట్‌ఫోన్ LeEco 1s Eco. ఈ డివైస్‌కు సంబంధించిన రెండవ ఫ్లాష్‌సేల్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. లీఇకో లీ1ఎస్ ఇకో ఫోన్‌కు సరిజోడి అయిన మోటో జీ4 మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్ కాబోతున్న నేపథ్యంలో, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. హోరాహోరి స్పెసిఫికేషన్‌లతో అలరిస్తోన్న ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన spec comparisonను ఇప్పుడు చూద్దాం...

Read More : మోటో జీ4 ప్లస్‌తో తలపడుతోన్న 10 స్మార్ట్‌‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్

లీ1ఎస్ ఇకో vs మోటో జీ4

ఈ ఫోన్‌లకు సంబంధించి డిజైనింగ్ విభాగాలను పరిశీలించినట్లయితే లీ1ఎస్ ఇకో ఫోన్ పూర్తి మెటల్ యునిబాడీ డిజైన్‌‍తో వస్తోంది. ఈ బిల్డ్ క్వాలిటీ, ఫోన్‌కు మంచి ప్రీమియమ్ లుక్‌ను తీసుకువచ్చింది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన గ్లాస్, క్లాసీ అప్పీల్‌ను తీసుకువస్తుంది. మరోవైపు మోటో జీ4 మెటాలిక్ ఫ్రేమ్స్‌తో కూడిన ఫ్లెక్సిబుల్ రిమూవబుల్ బ్యాక్‌ కవర్‌తో స్తోంది. Texture గ్రిప్‌ చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది.

డిస్‌ప్లే విషయానికొస్తే..

లీ1ఎస్ ఇకో vs మోటో జీ4

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేలతో వస్తున్నాయి. రిసల్యూషన్ కూడా ఒకటే (1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. లీ1ఎస్ ఇకోతో పోలిస్తే మోటో జీ4 డిస్‌ప్లే బెటర్ వ్యూవింగ్ యాంగిల్స్‌ను కలిగి ఉంటుంది.

 

ప్రాసెసర్ విషయానికొస్తే..

లీ1ఎస్ ఇకో vs మోటో జీ4

లీ1ఎస్ ఇకో స్మార్ట్‌ఫోన్ 1.85గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్‌తో వస్తుండగా మోటో జీ4 ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సాక్ పై రన్ అవుతుంది. మీడియాటెక్ SoCలతో పోలిస్తే స్నాప్‌డ్రాగన్ SoCలు బెటర్ ఆప్టిమైజేషన్‌ను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

 

స్టోరేజ్ విషయానికొస్తే...

లీ1ఎస్ ఇకో vs మోటో జీ4

స్టోరేజ్ విషయానికొస్తే మోటో జీ4 రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అందులో మొదటి వేరియంట్ (2జీబి, 16జీబి ఇంటర్నల్ మెమరీ), రెండవ వేరియంట్ (2జీబి, 32జీబి ఇంటర్నల్ మెమరీ), ఈ రెండు ఫోన్‌లలో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం కల్పించారు. మరోవైపు లీఇకో లీ1ఎస్ ఇకో 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ఈ ఫోన్‌లో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫీచర్ లోపించింది.

 

కెమెరా విషయానికొస్తే...

లీ1ఎస్ ఇకో vs మోటో జీ4

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాలతో లభ్యమవుతోన్నాయి. అయితే మోటో జీ4లో డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యం ఉంది. ఫోన్ ముందు భాగాల్లో 5 మెగా పిక్సల్ సెల్ఫీ షూటర్లను ఏర్పాటు చేసారు. ఆటో హెచ్‌డీఆర్, f/2.2 అపెర్చర్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ కెమెరాలు కలిగి ఉన్నాయి.

 

యూఎస్బీ టైప్ సీ, ఫింగర్ ప్రింట్ స్కానర్

లీ1ఎస్ ఇకో vs మోటో జీ4

లీ1ఎస్ ఇకో ఫోన్ యూఎస్బీ టైప్ సీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. మోటో జీ4 ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రమే అందుబాటులో ఉంచారు. డ్యుయల్ సిమ్ సామర్థ్యం కలిగిన ఈ రెండు ఫోన్‌‌లు 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీలతో వస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 1s Eco vs Moto G4: Which one gives more value for money!. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot