లీ 1ఎస్.. ఓ ‘ట్రెండ్ సెట్టర్’

Written By:

ప్రీమియమ్ మెటల్ ఛాసిస్ అనేది ఒకప్పుడు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితమయ్యేది. లీ 1ఎస్ స్మార్ట్‌ఫోన్ రాకతో ఈ ట్రెండ్ కాస్తా రివర్స్ అయ్యింది. బడ్జెట్ ధర సెగ్మెంట్‌లో లీఇకో నుంచి విడుదలైన లీ 1ఎస్ స్మార్ట్‌ఫోన్ పూర్తి మెటల్ బాడీతో సరికొత్త శకానికి నాంది పలికింది. రూ.10,999 ధర ట్యాగ్‌తో మార్కెట్ ‌ పరిచయమైన ఈ 'ట్రెండీ ఫుల్ మెటల్ బాడీ ఫోన్'అమ్మకాల సునామీని సృష్టిస్తోంది.

లీ 1ఎస్.. ఓ ‘ట్రెండ్ సెట్టర్’

ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియమ్‌తో వస్తోన్న ఈ పూర్తి మెటల్ బాడీ ఫోన్ తన స్ర్కూ‌లెస్ ఇండస్ట్రీయల్ డిజైనింగ్‌తో ఫోన్ అసెంబ్లింగ్ ప్రక్రియలోనే విప్లవాత్మక ఒరవడికి నాంది పలికింది. హైఎండ్ ఫోన్‌లలో మాత్రమే ఆఫర్ చేసే బీజిల్ లెస్ డిజైన్, ఫుల్ ఫ్లోటింగ్ గ్లాస్ వంటి క్లాసికల్ ఫీచర్లను లీ 1ఎస్ ఫోన్‌లో మీరు చూడొచ్చు. పూర్తి మెటల్ బాడీతో వచ్చే ఫోన్ లు ఎంత వేగంగా హీట్ అవుతాయో అంతే వేగంగా కూల్ అవుతాయి. అదే విధంగా సిగ్నల్ రిసీవింగ్ కూడా వేగంగా ఉంటుంది. హీటింగ్‌ సమస్యలకు దూరంగా ఉండేందుకు లీ 1ఎస్ యూజర్లకు పలు ముఖ్యమైన చిట్కాలు...

Read More : ఫోన్ వాడొద్దన్నారని, వేలు కత్తిరించుకున్నాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీ 1ఎస్ యూజర్లకు పలు ముఖ్యమైన చిట్కాలు...

కాంపాక్ట్ సైజ్

స్మార్ట్‌ఫోన్‌లు కాంపాక్ట్ సైజ్‌లో రావటం వల్ల హీటింగ్ సమస్య అనేది ఎక్కువుగా ఉంటుంది. ఈ బహుళ ఉపయోగకర గాడ్జెట్‌లలో వర్క్‌లోడ్ పెరిగే కొద్ది హీటింగ్ సమస్య పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్‌లలో వెంటిలేషన్ స్పేస్ తక్కువుగా ఉండటం వల్ల లోపలి వేడి అంత త్వరగా బయటకు వెళ్లేందుకు ఆస్కారం ఉండదు. బ్యాటరీ దగ్గరగా ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయటం, ఇదే సమయంలో ఫోన్ డిజైన్‌కు అనుగుణంగా చిన్ని కేస్‌లో హార్డ్‌వేర్‌ను నిక్షిప్తం చేయటం వల్ల ఇరుకు ఇరుకు ఉంటుంది.

 

లీ 1ఎస్ యూజర్లకు పలు ముఖ్యమైన చిట్కాలు...

మితిమీరిన గేమింగ్

హెవీ గ్రాఫిక్స్‌తో కూడిన గేమ్‌లను అదేపనిగా ఆడటం వల్ల ఫోన్ మథర్ బోర్డ్ పై ఎక్కువ ఒత్తిడి ఏర్పడి ఎలక్ట్రానిక్ ఇన్‌పుట్స్ వేగవంతమైన రేటింగ్‌తో పుష్ కాబడతాయి. ఒక గేమ్‌ను ప్లే చేయాలంటే ఫోన్‌కు అనేక వనరులు అవసరమవుతాయి. మితిమీరిన గేమింగ్ కూడా ఫోన్ ఓవర్ హీటింగ్‌కు కారణమే.

 

లీ 1ఎస్ యూజర్లకు పలు ముఖ్యమైన చిట్కాలు...

మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతున్నట్లయితే ముందుగా ఫోన్ కేస్‌ను తొలగించండి. ఇలా చేయటం వల్ల ఫోన్ త్వరగా కూల్ అవుతుంది.

లీ 1ఎస్ యూజర్లకు పలు ముఖ్యమైన చిట్కాలు...

మార్కెట్‌కు పరిచయమైన కొద్ది రోజుల్లోనే లీఇకో తన సత్తాను చాటుకుంది. లీ1ఎస్ సూపర్ ఫోన్‌లు భారతీయులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఫోన్‌లను కేవలం 30 రోజుల వ్యవధిలోనే 2 లక్షల మందికి పైగా కొనుగోలు చేసారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Metal-clad LeEco Le 1S sets a new trend in budget smartphone segment in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot